లాప్ టాప్ కీ బోర్డులో బంగారం స్మగ్లింగ్ .

  0
  367

  బంగారం అక్రమ రవాణా నిలువరించేందుకు ఎయిర్ పోర్ట్‌ కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, స్మ‌గ్లింగ్ మాత్రం ఆగడం లేదు. కొత్త కొత్త దారుల్లో స్మగ్లర్లు బంగారాన్ని తరలిస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా గోల్డ్ స్మ‌గ‌ర్లు కొత్త ఐడియాతో ముందుకొచ్చారు. అయినా చెన్నై ఎయిర్ పోర్ట్ క‌స్ట‌మ్స్ అధికారులు వీరిని ప‌ట్టుకుని అరెస్టు చేశారు. ఈ స్మ‌గ్ల‌ర్లు రేకుల్లా త‌యారు చేసి కంప్యూట‌ర్ కీ బోర్డులు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్ ల మ‌ధ్య పెట్టుకుని చెన్పైలో దిగారు. అయితే క‌స్ట‌మ్స్ సిబ్బందికి అనుమానం రావ‌డంతో వాటిని చెక్ చేశారు.

  బంగారంతో త‌యారుచేసిన రేకుల‌ను ఈ ఎల‌క్ట్రానిక్స్ గూడ్స్ కి అతికించి ఉండ‌డాన్ని గుర్తించారు. మొత్తం 5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారంతో పాటు కంప్యూట‌ర్ సామాగ్రి, ఎల‌క్ట్రానిక్ గూడ్స్ ను కూడా సీజ్ చేశారు. వీటి మొత్తం విలువ 2 కోట్ల 20 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న క‌స్ట‌మ్స్ అధికారులు, నిందితుల‌ను అరెస్టు చేశారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..