వ్యాక్సిన్ వేసుకుంటే బంగారు ముక్కు పుడక.

  0
  113

  వ్యాక్సిన్ వేసుకుంటే బంగారు ముక్కు పుడక..
  కోవిడ్ వ్యాక్సిన్ పై నమ్మకం కంటే అనుమానాలే ఎక్కువ. ఇప్పటికీ చాలామంది వ్యాక్సిన్ వేసుకోవాలంటే భయపడుతుండటంతో గుజరాత్ లోని గాంధీ నగర్ లో రాజ్ కోట్ స్వర్ణకార సంఘం ఓ కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. మహిళలు ఎవరైనా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే బంగారు ముక్కు పుడక ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. దీంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకొచ్చిన 758మంది మహిళలకు ముక్కు పుడకలు ఉచితంగా ఇచ్చింది. మగవారికి హ్యాండ్ బ్లెండర్స్ ని ఉచితంగా ఇచ్చింది. గుజరాత్ లో కొవిడ్ మహమ్మారి రోజు రోజుకీ తీవ్రం అవుతుండటంతో వ్యాక్సిన్ వేసుకోవడంపై మహిళల్లో అవగాహన కల్పించేందుకు బంగారు ముక్కు పుడకల పథకాన్ని అమలు చేశారు.

   

  ఇవీ చదవండి

  ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

  మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు