బంగారుబాబు నామినేషన్ వేసాడు..

    0
    1018

    తమినాడులో గోల్డ్ మ్యాన్ గా పేరున హరినాడార్ అసెంబ్లీకి నామినేషన్ ఎలా వేశాడో తెలుసా..? ఒళ్లంతా బంగారం ధరించి తిరునల్వేలి జిల్లా అలంగుళమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాడు. ఆయన ఒంటిమీద 45 లక్షల విలువైన ఐదు కిలోల బంగారం ఉంది. నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వచ్చిన హరి నాడార్ ను చూసి స్థానికులే కాదు, రిటర్నింగ్ అధికారులు సైతం కళ్లప్పగించి చూశారు.

    ఇక అఫిడవిట్లో తనకు 11.2 కిలోల బంగారం ఉందని పేర్కొన్నాడు. హరినాడార్ పై 9 క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుంటాడు. ఆయన భార్యకూడా 3 కిలోల నగలను ఎపుడూ ధరించివుంటుంది.. తాజాగా సినిమా కూడా తీస్తున్నారు. నాలుగు పెళ్ళిళ్లతో వార్తలకెక్కిన అలనాటి హీరోయిన్ మంజుల కూతురు , వనితా విజయ్ కుమార్ చిత్రంలో హీరోయిన్. హీరో మాత్రం హరినాడారే..

    ఇవీ చదవండి

    క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

    భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

    బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

    భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..