ఆరెంజ్ ట్రావెల్ బస్సులో మంటలు..సజీవదహనం.

  0
  1720

  క‌ర్నాట‌క‌లో జ‌రిగిన ఓ ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 8 మంది చ‌నిపోయారు. గోవా నుంచి హైద‌రాబాద్‌కి వ‌స్తున్న బ‌స్సులో మంట‌లు చెల‌రేగి.. హైద‌రాబాద్‌కి చెందిన 8 మంది ప్ర‌యాణీకులు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు.

  ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన ఈ స్లీప‌ర్ బ‌స్సు.. క‌ర్నాట‌కలోని క‌ల‌బురిగి జిల్లా అమ‌లాపూర్‌లో మినీ లారీని ఢీ కొట్టింది. ఆ త‌ర్వాత బ‌స్సు గుంట‌లో ప‌డిపోయింది. వెంట‌నే బ‌స్సులో మంట‌లు అంటుకుని 8 మంది చ‌నిపోయారు. మృతుల్లో ఇద్ద‌రు పిల్ల‌లు, ఇద్ద‌రు మ‌హిళ‌లు, మ‌రో న‌లుగురు పురుషులు ఉన్నారు.

  రెండు కుటుంబాల‌కు చెందిన 32 మంది గోవా విహార‌యాత్ర‌కు ఈ బ‌స్సులో వెళ్ళారు. విహార‌యాత్ర ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

   

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..