కుక్కలను చంపే ఇంజెక్షన్ తో భర్తను..

    0
    459

    ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో జమాల్ సాహెబ్ అనే వ్యక్తి మరణంపావు మిస్టరీ వీడింది. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు , చాలా తెలివిగా చిక్కుముడి విప్పారు. కట్టుకున్న భార్యే , ప్రియుడి మోజులోపడి , కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి , భర్తను చంపించింది. ఒక పధకం ప్రకారం ఈ పని చేయించింది. బైక్ పై వెళుతుండగా లిఫ్ట్ అడిగిన దుండగులు ఆయనకు వెనుకనుంచి ఇంజెక్షన్ గుచ్చి చంపడం సంచలనం సృష్టించింది. పిచ్చికుక్కలను చంపే రసాయనాన్ని ఇంజెక్షన్ లో నింపి జమాల్ సాహెబ్ కు గుచ్చడంతో కొన్ని నిమిషాల్లోనే ఆ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. ఈ నెల 19న ఈ ఘటన జరిగింది. ఇది సైకో పని అయ్యుంటుందని అందరూ హడలిపోయారు. అయితే, ఖమ్మం జిల్లాలో పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకుని ఈ మిస్టరీని ఛేదించారు.

     

    ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్య అని, భార్యే సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. జమాల్ సాహెబ్ భార్య ఇమాంబీ మరొకరితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. అయితే భర్త అడ్డుగా ఉన్నాడని, అతడిని అంతమొందిస్తే తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నించేవారే ఉండరని ఇమాంబీ ఆలోచించింది. తన భర్తను చంపేయాలని నిర్ణయించుకుని మోహనరావు, వెంకట్, వెంకటేశ్ ల సహాయం తీసుకుంది. పక్కా ప్రణాళికతో వ్యవహరించిన నిందితులు మానవతా దృక్పథంతో లిఫ్ట్ ఇచ్చిన జమాల్ సాహెబ్ ను నిర్దాక్షిణ్యంగా అంతమొందించారు.ఇప్పుడు వీరందరూ పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా, రెండు నెలల నుంచే జమాల్ సాహెబ్ ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నిందితులు వెల్లడించినట్టు తెలుస్తోంది..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.