కోవిషీల్డ్ వాక్సిన్ మధ్య గ్యాప్ పెంచారు..

  0
  38

  కరోనా వాక్సిన్ పై వాక్సిన్ జాతీయ సాంకేతిక సలహా మండలి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిషీల్డ్ వాక్సిన్ తొలిడోసుకు రెండవ డోసుకు సమయాన్ని పెంచుతూ నిభంధనలను రూపొందించారు. కోవిషీల్డ్ తొలిడోసు వేసుకున్నాక.. 12 – 16 వారాల మధ్య రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. సాంకేతిక సలహా మండలి నిపుణుల బృందం పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.

  తొలుత ఈ టీకా మొదటి డోసు తీసుకున్న నాలుగు నుంచి ఆరువారాల వ్యవధిలో రెండో డోసు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఏప్రిల్‌లో ఆ సమయాన్ని ఆరువారాల నుంచి ఎనిమిది వారాలకు పెంచారు. తాజాగా మరో సారి టీకా డోసుల మధ్య గడువు 12 – 16 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక కొవాగ్జిన్‌ డోసుల విషయంలో మాత్రం ఏ మార్పు ఉండదని స్పష్టం చేశారు.

  6-8 వారాల గడువు మాత్రమే చాలని అభిప్రాయపడ్డారు. ఎలాంటి మార్పు జరగలేదు. అలాగే కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు 6 నెలల వరకు వాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. వాక్సిన్ వేసుకోవాలనుకునే గర్భిణీ స్త్రీల విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. డెలివరీ తర్వాత ఎప్పుడైనా వాక్సిన్ వేసుకోవచ్చని చెప్పారు. ఒకవేళ గర్భిణీ స్త్రీలు వాక్సిన్ వేసుకోవాలనుకుంటే డాక్టర్ సలహా తీసుకోవాలని సూచించారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.