చివరకు స్నేహితులే కాటివరకు తోడుగా వచ్చారు.

  0
  750

  కరోనా లేదు.. టైఫాయిడ్ జ్వరంతో చనిపోయాడు.. అయినా అంత్యక్రియలకు ఎవరూ రాలేదు. పక్కిళ్లలో వాళ్ళు ఇల్లు తాళాలేసుకొని వెళ్లిపోయారు.. కరోనా భయంతో బంధువులు బాంధవ్యాలు అన్నీ బూటకమని తేలిపోయాయి…అయితే స్నేహం మాత్రం నిలిచింది.. ఆ నలుగురు స్నేహితులు ఒక్కటై , గతించిన తమ స్నేహితుడికి అంత్యక్రియలు చేశారు.. స్నేహమేరా ,జీవితం , స్నేహమేరా శాశ్వతం .. అన్న మాటను నిజంచేశారు.. ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు గాదంశెట్టి గుప్తా వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

  4 రోజుల కిందట రక్త పరీక్ష చేయించగా టైఫాయిడ్‌ అని తేలింది. దీంతో మందులు వాడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున జ్వరం ఎక్కువైంది. పరిస్థితి విషమించి చనిపోయాడు. కరోనా పరీక్షలు చేస్తే నెగెటివ్ అనితేలింది. అయినా ఎవరూ ముందుకు రాలేదు. ఆయనకు బిడ్డలులేరు. భార్య , వృద్ధులైన తల్లితండ్రులు ఎంత ప్రాధేయపడ్డా ఎవరూ సాయం అందించలేదు. ఒక రోజు గడిచినా బంధువులూ రాలేదు.

  ఈ విషయం స్నేహితులకు తెలిసి ముందుకొచ్చి తామే దహన సంస్కారాలు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు షేక్‌ మౌలాలి, కొమరోలు, దద్దవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శులు రమణయ్య, సుబ్బారావు, మాజీ పోస్టల్‌ ఉద్యోగి థామ్సన్, ‘సాక్షి’ రిపోర్టర్‌ కృష్ణారెడ్డి… సోమవారం సాయంత్రం గాదంశెట్టి గుప్తా మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతేకాకుండా ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు.. కొంత నగదు సేకరించి అండగా నిలిచారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.