ప్రియురాలి కోసం చావు దెబ్బలు .

  0
  2793

  ప్రియురాలిని కలిసేందుకు వీలుకాకపోతే మారువేషాలు వేయడం, టక్కుటమార విద్యలు ప్రదర్శించడం సినిమాల్లోనే చూస్తుంటాం .నిజ జీవితంలో ప్రియురాళ్ల ఇంటిగ్గర ఇలాంటి మారువేషాలు , టక్కుటమార విద్యలు పనిచేయవు. వికటిస్తే వళ్ళు గుల్లవుతుంది. అలాంటిదే ఇది.. పాపం కాలేజీలో ప్రియురాలు చాలాకాలం నుంచి టచ్ లో లేకుండా పోయింది. ఆమె విషయంతెలిసి ఇంట్లో వాళ్ళు కట్టడి చేశారు. దీంతో ప్రేమికుడికి టెన్షన్ మొదలయింది . ఎలాగైనా ప్రియురాలిని కలుసుకోవాలని , ఆమెను చూడాలని బాబా వేషం ధరించాడు. విగ్గు , గడ్డం మేకప్ ఆర్టిస్ట్ దగ్గర అద్దెకు తీసుకున్నాడు. ఒక జోలె కుట్టించుకున్నాడు. జోలెలో అరకిలో బియ్యం , కొన్ని చిల్లర డబ్బులు , దండం , కమండలం , బొచ్చె, నామాలు ..ఇలా అచ్చం బాబా స్టయిల్లో దిగేశాడు.

  గడ్డం లాగితే , వేషం మొత్తం ఊడివచ్చింది.

  తాను హిమాలయాల్లో యోగినని చెప్పాడు. యాక్టింగ్ అనుభవం లేకపోవడంవల్ల , ప్రియురాలి ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. స్థానికులకు అనుమానం వచ్చింది. పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగగా భావించి నిలదీశారు. మరో కుర్రాడు గడ్డం లాగితే , వేషం మొత్తం ఊడివచ్చింది. ఇంకేముంది .. తలా ఒక దెబ్బ వేసి , వళ్లు హూనంచేసి పోలీసులకు అప్పజెప్పారు. అప్పుడు అబ్బాయి నిజం చెప్పేశాడు.
  ఈ వేషగాడు ఒరిస్సా జాజిపూర్ అంగుల్‌లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమించాడు.

  హిమాలయాల నుంచి వచ్చినట్లు బుకాయించాడు

  విద్యార్థిని కుటుంబ సభ్యులు వీరి ప్రేమని నిరాకరించారు.దీంతో ప్రియురాలి ఇంట్లో తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు ఆమెతో ముఖాముఖి భేటీ కావాలనుకున్నాడు. తక్షణమే వేషం మార్చి బాబాగా తయారయ్యాడు. ప్రియురాలి ఇంటి పరిసరాల్లో తిరుగాడుతున్న అతన్నిపై అనుమానంతో స్థానికులు పట్టుకుని నిలదీశారు. మొదట తాను హిమాలయాల నుంచి వచ్చినట్లు బుకాయించాడు. అతడి సమాధానాలతో ఏకీభవించని స్థానికులు సందేహంతో గడ్డం లాగడంతో బండారం బట్టబయలైంది. దొంగ బాబాను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

   

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

   

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

  గూడు వదిలిన ప్రేమ పక్షులు ఒకటైన తర్వాత ఇది మామూలేగా .