తిరుమల పోటులో అగ్ని ప్రమాదం..

  0
  147

  తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదం తయారు చేసే పోటులో అగ్నిప్రమాదం జరిగింది. వకుళమాత పోటులో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇది కేవలం స్వల్పమైన ప్రమాదమేనని, భక్తులెవరూ భయపడాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు అధికారులు.

  అసలేం జరిగింది..?
  పోటులో వివిధ ఆహార పదార్థాలను తీసుకొచ్చిన గోనె సంచులను పక్కనే పడేశారు. వాటికి మంటలు అంటుకోవడంతో వెంటనే దట్టమైన పొగలు వ్యాపించాయి. గోనె సంచులకు నెయ్యి అంటుకుని ఉండటంతో.. మంటలు వెంటనే వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..