ప్రధాని ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ పెడితే కేసు పెట్టారు..

  0
  54

  రాజకీయాల్లో ప్రధానమంత్రులు, ముఖ్య మంత్రులు, చివరకు సర్పంచుల వరకూ ప్రజల డబ్బును అడ్డదిడ్డంగా ఖర్చు చేసేస్తుంటారు. ప్రధాని, ముఖ్య మంత్రుల పేషీల్లో అయితే కాఫీ, టీ ఖర్చులే లక్షల్లో దాటి పోతుంటాయి. నిద్ర లేచింది మొదలుకొని.. అన్నీ ప్రజల డబ్బుతోనే జరిగిపోతుంటాయి. అయితే ఫిన్లాండ్ దేశంలో పరిస్థితి వేరు.. ఆ దేశ మహిళా ప్రధానమంత్రి సన్నా మారీన్ ఇంట్లో ఆమెకు కాకుండా ఆమె తల్లిదండ్రులకు, బంధువులకు, భర్తకు ప్రభుత్వ ఖర్చుతో టిఫిన్లు పెడుతున్నారని పెద్ద దుమారమే చెలరేగింది.

  ఇంతకీ ఆ పద్దు కింద ఖర్చు ఎంతో తెలుసా..? కేవలం 300 ఫిన్ మార్కులు.. మన దేశకరెన్సీలో అయితే నెలకు 26 వేల రూపాయలు.. ఇంతమొత్తాన్ని మన మంత్రుల పేషీల్లో అయితే వారానికే ఖర్చు చేస్తారు. ఫిన్లాండ్ లో ప్రజల డబ్బుతో ప్రధాన మంత్రులు, మంత్రుల ఇళ్లలో వారి స్నేహితులు తినడం పెద్ద నేరం.. అందుకే ఈ వార్త తెలిసిన వెంటనే ప్రధాని ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ ఖర్చులపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రధానమంత్రి కూడా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తన కార్యాలయ సిబ్బంది, తనకు తెలియకుండా చేశారని.. బహుశా తనకార్యాలయ సిబ్బంది ఖర్చులకై ఉంటుందని అన్నాడు. ఏదేమైనా పోలీసు విచారణను స్వాగతిస్తున్నట్టు చెప్పాడు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..