కన్నపేగు కన్నుమూస్తే భుజంపైనే కాటి వరకు..

  0
  59

  కరోనా కన్నీటి కధల్లో ఇదొక దారుణం.. మానవత్వాన్ని ప్రశ్నించే దయనీయం.. ఓ తండ్రి జలంధర్ లో పదకొండేళ్ల కూతురు శవాన్ని భుజాలపై వేసుకొని తీసుకెళ్తున్నాడు. గత రెండు నెలలుగా సోను అనే ఈ బాలికకు ఆరోగ్యం సక్రమంగా లేదు. ఇరుగుపొరుగు సలహాపై బాలికను అమృతసర్ తీసుకెళ్లారు. కోవిడ్ రిపోర్ట్ రానిదే వైద్యం చేసేందుకు వీలు కాదని చెప్పారు. ఈలోగా తన కూతురు చనిపోయిందని .. ఎవరూ సాయం చేయకపోవడంతో కూతురు శవాన్ని తీసుకొని ఊరు బయలుదేరానని చెప్పాడు. తన కూతురుకు చనిపోయే సమయానికి కరోనా కూడా సోకడంతో కన్నా పేగు బంధాన్ని వదులుకోలేక.. తన చేతులమీదుగా అంత్యక్రియలు చేయాలని తీసుకొచ్చినట్టు చెప్పాడు. తన కొడుకొక్కడే తనతో స్మశానం వరకూ వచ్చాడని తెలిపాడు. ఇలాంటి కన్నీటి కథే హిమాచల్ ప్రదేశ్ లోనూ జరిగింది. ఓ మహిళ కరోనాతో చనిపోవడంతో అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొడుకే ఆమె శవాన్ని భుజాన వేసుకుని కిలోమీటర్ దూరంలోని స్మశానంలో దహనం చేశాడు.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.