కొడుకు మందుల కోసం ఆ పేద తండ్రి డొక్కు సైకిల్ పై ..

  0
  56

  తన బిడ్డ మందులకోసం ఓ పేద తండ్రి చేసిన త్యాగం, పడ్డ శ్రమ అందర్నీ కదిలించేసింది. కర్నాటకలోని బన్నూరు సమీపంలోని గనిగన్ కొప్పల్ అనే కుగ్రామం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరుకు తన బిడ్డ మందులకోసం సైకిల్ తోలాడు. మందులు తీసుకుని మళ్లీ 150 కిలోమీటర్లు వెనక్కి వచ్చి బిడ్డకు అందించాడు. ఆనంద్ అనే 40ఏళ్ల వ్యక్తి కూలీగా పనిచేస్తుంటాడు. ఆయన కొడుక్కి గత 10ఏళ్లుగా మూర్ఛ వ్యాధి ఉంది. 18ఏళ్ల వరకు మందులు క్రమం తప్పకుండా వాడాలని, అలా వాడకపోతే వ్యాధి తగ్గదని బెంగళూరులోని నిమ్ హాన్స్ వైద్యులు చెప్పారు.

  లాక్ డౌన్ టైమ్ లో మందులు అయిపోవడంతో ఆనంద్ తన కొడుకు మందులకోసం తనకున్న డొక్కు సైకిల్ పై 150 కిలోమీటర్ల దూరంగో ఉన్న బెంగళూరు వెళ్లి ఆ మందులు కొనుక్కుని మళ్లీ వెనక్కి వచ్చేవాడు. బెంగళూరులోని నిమ్ హాన్స్ వైద్యులు, ఆనంద్ ఇంత దూరం సైకిల్ పై వచ్చాడని తెలుసుకుని 1000రూపాయలు చేతి ఖర్చులకు ఇచ్చి పంపించారు. మే 23న బయలుదేరిన ఆనంద్ మందులతో మే 26న ఇంటికి తిరిగొచ్చాడు. ఆనంద్ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు బిడ్డపై అతని ప్రేమను అభినందించి తమకు తోచిన సహాయం కూడా చేసేవారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..