కోడలితో మామ అక్రమ సంబంధం.. చివరకు కొడుకునే..

    0
    833

    కోడలంటే కూతురుతో సమానం అంటారు. అలాంటి కోడలిపైనే కన్నేశాడు ఓ మామ. అంతే కాదు, ఆ బలహీనురాలిని లొంగదీసుకున్నాడు, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత మరింత దారుణం చేశాడు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడంటూ కన్న కొడుకునే కడతేర్చాడు. ఆ తరువాత ఏం తెలియనట్లు పోలీసుస్టేషన్‌ కు వెళ్లి తన కొడుకు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశాడు. విచారణలో వెల్లడైన విషయాలు విని పోలీసులే ఖంగుతిన్నారు.
    ఈ షాకింగ్‌ సంఘటన బీహార్‌ రాజధాని పాట్నా పరిధిలోని కొద్రాలో జరిగింది. కొద్రా పాంతంలోని మిథిలేష్‌ రవిదాస్‌ కుమారుడు సచిన్‌కు కొంతకాలం క్రితం వివాహమైంది. అనంతరం కొన్నిరోజుల తరువాత రవిదాస్‌ కుమారుడి భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రి ప్రవర్తన గురించి కొడుకుకి అనుమానం రావడంతో నిలదీశాడు. దీంతో రవిదాస్ తన కొడుకును కిరాతకంగా కత్తితో గొంతుకోసి చంపి.. తోటలో పడేశాడు. అనంతరం నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. తన కొడుకు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడని పాలిగంజ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజీవ్ సింగ్ తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన ఐదుగురిపై అనుమానం వ్యక్తంచేశాడని.. అనంతరం వారందరిని విచారిస్తున్న క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?