బెంగాల్ నుంచి లెఫ్ట్ అయిపోయిన లెఫ్ట్ కూట‌మి

  0
  125

  లెఫ్ట్ అయిపోయిన లెఫ్ట్ కూట‌మి…

  ==========

  పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా పాలించిన లెఫ్ట్ పార్టీ క‌నివినీ ఎరుగని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 1977 నుంచి 2011 వరకు ఏకచత్రాధిపత్యంగా పాలించిన వామపక్షాల కూట‌మి గ్రాఫ్ ప‌డిపోతూ వ‌చ్చింది. తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు శతవిధాలా పోరాడుతోంది. అయినా ఫ‌లితం మాత్రం శూన్యంగా క‌నిపిస్తోంది. జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి సీనియర్ నేతలకు ఉన్నంత చ‌రిష్మా ఇప్ప‌టి ఆ పార్టీ నేతలకు లేక‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం. 34 ఏళ్ళ‌ పాటు రాజ్యమేలిన వామపక్ష పార్టీలకు మార్గనిర్దేశం చేసే నేతలే కరవయ్యారు. దీంతో ఆనాటి వైభవాన్ని, ప్రాభ‌వాన్ని వామపక్ష పార్టీలు కోల్పోయాయి.

  ======================

  సంవ‌త్స‌రం – అసెంబ్లీ స్థానాలు – గెలిచిన సీట్లు

  ========     ============   ===========

  1977         –      294                   – 231

   

  1982         –      294                   – 238

   

  1987         –      294                   – 251

   

  1991         –      294                   – 244

   

  1996         –      294                   – 206

   

  2001         –      294                   – 199

   

  2006         –      294                   – 234

   

  34 ఏళ్ళు ఏలిన‌ లెఫ్ట్ ఫ్రంట్ ప‌త‌నం ఇలా…

   

  2011         –      294                   – 62

   

  2016         –      294                   – 32

   

  2021         –      294                   – 01

   

  సుమారు మూడున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వ‌ర‌కు సుదీర్ఘ కాలం పాటు ప‌శ్చిమ‌బెంగాల్‌లో ఎర్ర‌జెండా ఎగుర‌వేసిన లెఫ్ట్ ఫ్రంట్ విజయ పరంపరకు తెర పడింది. క‌మ్యూనిస్ట్ పార్టీల పునాదుల‌న్నీ కూలిపోయిన‌ట్ల‌యింది. మూడంకెల నుంచి రెండంకెల సీట్ల‌కు ప‌డిపోయింది. ఇక ఇప్పుడు సింగిల్ డిజిట్ కే ప‌రిమిత‌మైంది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.