ప్రేమ వికటించింది.. ప్రాణం తీశాడు..

  0
  5694

  ప్రేమించుకున్నన్ని రోజులు అంతా బాగానే ఉంది. పెళ్లి చేసుకోవాలంటూ యువతి కోరడంతో అప్పటి వరకూ ఆమెపై ఉన్న ప్రేమ ద్వేషంలా మారింది. అడ్డు తొలగించుకోడానితి లాడ్జికి తీసుకెళ్లాడు. హత్య చేసి చంపేశాడు. అయితే అక్కడే ఓ చిన్న నాటకం ఆడాడు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తామిద్దహం ఆత్మహత్యకు ప్రయత్నించామని, అమ్మాయి చనిపోయిందని, తాను కొన ఊపిరితో బతికి బయటపడ్డానంటూ పోలీసుల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ కొన ఊపిరితో ఉన్న ఆ యువకుడు హైదరాబాద్ నుంచి ఒంగోలు ఎలా వచ్చి ఆస్పత్రిలో చేరాడా అని పోలీసులు ఆరా తీయడంతో అసలు కథ బయటపడింది. హైదరాబాద్ చందా నగర్ లో ఆత్మహత్యాయత్నం చేయడం ఏంటి..? అక్కడినుంచి నేరుగా ఒంగోలు రావడం ఏంటా అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రియుడు కోటిరెడ్డిని అరెస్ట్ చేశారు.

  అసలు కథ ఇదీ..
  ప్రకాశం జిల్లా కరవది ప్రాంతానికి చెందిన గొర్రెముంచు నాగ చైతన్య (24). హైదరాబాద్ పరిధిలోని చందానగర్ నల్లగండ్ల లోని సిటిజన్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తోంది. గుంటూరు జిల్లా రెంట చింతల ప్రాంతానికి చెందిన గాదె కోటిరెడ్డి మెడికల్‌ రిప్రజంటేటివ్‌ గా పని చేస్తున్నాడు. తరచూ ఆస్పత్రికి వెళ్లే క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. యువతి తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. సవతి తల్లి మాత్రం ఉంది. సామాజిక వర్గాలు వేరు కావడంతో యువకుడి కుటుంబీకులు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో ఈ నెల 23న ఆసుపత్రి ఎదురు ప్రాంతంలోని ఓ లాడ్జిలో గది తీసుకున్నారు. ఇరువురు కలిసి ఉన్నారు. మరుసటి రోజు ఆదివారం రాత్రి వీరు తీసుకున్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది పరిశీలించడంతో గొంతుకోసి రక్తపు మడుగులో నాగచైతన్య మృతి చెంది ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రేమికుడు కోటిరెడ్డి పొట్ట, గొంతు దగ్గర కత్తి గాట్లతో ఒంగోలు వెళ్లి ఆసుపత్రిలో చేరినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆమె గొంతు కోసుకుందని, భయంతో తాను వచ్చేశానని కోటిరెడ్డి చెప్పినట్లు సమాచారం. లాడ్జి గదిని పరిశీలించగా గదిలో మద్యం సీసాలతోపాటు రక్తం మడుగును కడగడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగించిన పోలీసులు.. యువతిని కోటిరెడ్డి హత్య చేసి ఉంటాడని అనుమానించి అసలు విషయం రాబట్టారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..