చాందిని ధాటికి పరారైన మాజీ మంత్రి..

  0
  49

  సినీ నటి చాందిని ధాటికి తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ పరారైపోయాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మంచి, రహస్యంగా కాపురం చేసి ఇప్పుడు అడ్డంగా తిరుగుతున్నాడని మణికందన్ పై చాందిని కేసు పెట్టింది. భార్యకు విడాకులు ఇచ్చేసి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని తనతో కాపురం చేశాడని కూడా ఆమె ఆరోపించింది. అంతే కాదు. తమ బెడ్రూమ్ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి వాటితో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కూడా పోలీసులకు చెప్పింది చాందిని.


  చాందిని వ్యవహారం రచ్చకెక్కడంతో మణికందన్ పరారీలో ఉన్నాడు. పోలీసులు తనకోసం గాలిస్తున్నారని తెలుసుకున్న మణికందన్.. అడ్రస్ లేకుండా పోయాడు. అంతకు ముందు చాందినిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశాడు. చాందిని తనను బ్లాక్ మెయిల్ చేసిందని, 3కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని మీడియాతో చెప్పాడు.


  మలేసియాకు చెందిన నటి చాందిని 2017లో తమిళ ఇండిస్ట్రీకి పరిచయమైంది. అప్పట్లో అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మణికందన్ తో చాందినికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరు సఖ్యతగా ఉంటారనే విషయం అదంరికీ తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటి వరకు గుట్టుగా సాగిన వీరి వ్యవహారం చాందిని ఆరోపణలతో రచ్చకెక్కింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో మణికందన్ పరారయ్యాడు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..