రజినీసార్.. మీరు అమెరికా ఎందుకెళ్లారు..?

  0
  626

  సూపర్ స్టార్ రజినీకాంత్ హెల్త్ చెకప్ కోసం ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆల్రడీ ఆయన అల్లుడు ధనుష్ సినిమా షూటింగ్ కోసం అమెరికాలో ఉండగా.. ఇక్కడినుంచి సూపర్ స్టార్ ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలసి అక్కడికి వెళ్లారు. అయితే అక్కడినుంచి ఒక్క ఫొటో కూడా సోషల్ మీడియాలో కనిపించలేదు.
  రజినీపై హీరోయిన్ కస్తూరి సెటైర్లు..
  అమాజీ హీరోయిన్, ప్రస్తుత టీవీ ఆర్టిస్ట్ కస్తూరి.. రజినీకాంత్ అమెరికా టూర్ పై సెటైర్లు వేశారు.
  “చాలా రోజులుగా మన ఇండియన్స్ కు అమెరికా వెళ్లెందుకు పర్మిషన్ లేదు. అలాంటి పరిస్థితిలో రజినీ ఎలా వెళ్లారని ప్రశ్నించింది. హెల్త్ ఎమర్జెన్సీ అయినా మనకు అక్కడికి వెళ్లడానికి పర్మిషన్ లేదు.. కానీ రజినీ ఎలా వెళ్లారనేది అర్థం కావడం లేదు. అప్పుడేమో రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడేమో ఇలా వెళ్లారు. ఏం అర్థం కావడం లేదు. రజినీ సర్ ప్లీజ్ అన్నీ క్లారిటీగా చెప్పండి. మేయో క్లినిక్ అంటే అది గుండెకు సంబంధించింది. మరీ రజినీ సర్ ఆరోగ్య సమస్య ఏంటి?” అంటూ ప్రశ్నించారు కస్తూరి.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.