భర్తకు బై ..మామతో సై..కిలాడీ కోడలు.

    0
    1793

    భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన ఓ భార్య‌.. మామ‌ను పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు మామ‌తో ఒక బిడ్డ‌ను క‌ని, సోష‌ల్ మీడియాలో త‌న ఘ‌న‌కార్యాన్ని చెప్పుకుంది. దీనికి కొస‌మెరుపు ఏమిటంటే, విడాకులు ఇచ్చిన భ‌ర్త కూడా ఇప్పుడు ఆమె కొడుకుగా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ వింత వికృత సామాజిక బంధం అమెరికాలోని కెంట‌కీ హారోడ్ స‌ర్క్ ప్రాంతంలో జ‌రిగింది.

    ఎరికా అనే యువ‌తి జ‌స్టిన్ అనే యువ‌కుడిని పెళ్ళి చేసుకుంది. వారికి ఇద్ద‌రు బిడ్డ‌లు కూడా క‌లిగారు. త‌ర్వాత భ‌ర్త‌తో విభేదించి విడాకులు ఇచ్చేసింది. కొన్నాళ్ళ‌కు త‌న మాజీ భ‌ర్త జ‌స్టిన్ స‌వ‌తి తండ్రి జెఫ్ తో ప్రేమ‌లో ప‌డింది. ఆమెకి 30 ఏళ్ళు. జెఫ్ కి 60 ఏళ్ళు. ప్రేమ ముదిరి పెళ్ళి వ‌ర‌కు వ‌చ్చింది. మామ‌ను పెళ్ళాడి భ‌ర్త‌గా చేసుకుంది.

    ఇప్పుడు విడాకులు ఇచ్చిన భ‌ర్త ఆమెకు వ‌రుస‌కు కొడుకు అయ్యాడు. అంద‌రూ క‌లిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. మాజీభ‌ర్త‌కు పుట్టిన బిడ్డ‌ల‌ను భ‌ర్త‌కి వ‌దిలేసింది. ప్ర‌స్తుతం మామ‌ను పెళ్ళి చేసుకున్న త‌ర్వాత ఆమెకో బిడ్డ‌. ఈ గ‌జిబిజి సంబంధాలు త‌న‌కు అడ్డంకి కాద‌ని, ప్ర‌స్తుతం అంద‌రం బాగానే ఉన్నామంటూ సోష‌ల్ మీడియాలో చెప్పుకొచ్చింది. జ‌స్టిన్ కూడా విడాకులు ఇచ్చిన త‌ర్వాత ఆమె ఎవ‌రిని పెళ్ళి చేసుకుంటే త‌న‌కెందుక‌ని త‌న స‌వ‌తి తండ్రి భార్య‌గానే ఆమెను చూస్తాన‌ని చెప్పాడు.

     

    ఇవీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.