కరోనా రక్కసి రాష్ట్రంపై విరుచుకుపడింది.

  0
  519

  కరోనా మహమ్మారి ఒక్కరోజులోనే ఆంధ్ర ప్రదేశ్ పై విరుచుకుపడింది. రికార్డు స్థాయిలో అన్ని జిల్లాల్లో విలయతాండవం చేసింది. చిత్తూరు జిల్లాలో 1051 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో ఇదే మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత తూర్పు గోదావరి జిల్లాలో 906, గుంటూరులో 903, శ్రీకాకుళంలో 662, నెల్లూరు జిల్లాలో 624 పాజిటివ్ కేసులతో కరోనా విలయతాండవం చేసింది. కోవిడ్ కారణంగా చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, విశాఖలో ఇద్దరు, గుంటూరు, కడప, కృష్ణా, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు.

  ఇప్పటివరకూ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తొమ్మిదిన్నర లక్షలు దాటగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 40469 కేసులున్నాయి. ఇప్పటివరకూ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన చెందిన మన రాష్ట్రం.. ఇప్పుడు వాటికి పోటీగా తయారైంది. ప్రస్తుతానికి కోవిడ్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు కూడా సన్నద్ధంగా లేరు. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కొరత, మరోవైపు మందుల కొరత, మరోవైపు ఇంకా పూర్తిస్థాయిలో ప్రైవేటు ఆసుపత్రులను నోటిఫై చేయని పరిస్థితి. ఇన్నిటి మధ్య కరోనా రక్కసి రాష్ట్రంపై విరుచుకుపడింది.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.