నేనే కల్కి అవతారమంటున్న ఇరిగేషన్ అధికారి..

  0
  43

  గుజ‌రాత్ రాష్ట్రంలో ఓ ప్ర‌బుద్దుడు తాను ప్ర‌భుత్వ అధికారినైనా కార్యాల‌యానికి రాలేన‌ని, ఎందుకంటే తాను విష్ణువు ప‌దో అవ‌తార‌మ‌ని చెప్పాడు. క‌లియుగంలో క‌ల్కి అవ‌తారం త‌న‌దే అని, ప్ర‌పంచాన్ని మార్చేందుకు త‌ప‌స్సు చేస్తున్నాన‌ని. అందువ‌ల్ల విధుల‌కు హాజ‌రు కాకూడ‌ద‌ని చెప్పారు. త‌న త‌పోబ‌లం వ‌ల్ల‌నే వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని అన్నాడు. రామ‌చంద్ర ఫెఫ‌ర్ అనే ఈ వ్య‌క్తి గుజ‌రాత్ లోని స‌ర్దార్ స‌రోవ‌ర్ ప్రాజెక్టులో సూప‌రింటెండెంట్ ఇంజ‌నీరుగా ప‌ని చేస్తున్నాడు. ఎవ‌రు న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా తాను అవ‌తార పురుషుడినే అని త‌న‌కు తెలుసన్నాడు, 2010 నుంచే త‌న‌కు అతీత‌మైన శ‌క్తులు ఉన్నాయ‌ని అయితే తాను ఎవ‌రికీ చెప్ప‌లేద‌న్నాడు.

  రాబోయే రోజుల్లో తాను చెప్ప‌కుండానే త‌న‌ను క‌ల్పి పురుషుడిగా భ‌క్తులు గుర్తిస్తార‌ని చెప్పుకొచ్చాడు. ప్ర‌పంచ శాంతి కోసం తాను త‌ప‌స్సులో ఉండ‌డంతో ఆఫీసుకు కూడా రాలేన‌ని, త‌న త‌ప‌స్సు చివ‌రి ద‌శ‌లో ఉంద‌ని, ఆఫీసుకి వ‌స్తే దానికి ఆటంకం క‌లుగుతుంద‌ని, అందువ‌ల్ల విధుల‌కు రాన‌ని కూడా చెప్పాడు. తాను ఆఫీసుకి రావాల్నో, లేదా ఇంట్లో త‌ప‌స్సు చేసి దేశానికి క‌రువు పోగొట్టే విధంగా వ‌ర్షాలు కురిపించాలో ప్ర‌భుత్వ‌మే ఆలోచించుకోవాల‌ని రామ‌చంద్ర అన్నాడు. గ‌త 8 నెల‌లుగా ఆయ‌న ఆఫీసుకి కేవ‌లం 16 రోజులు మాత్ర‌మే హాజ‌ర‌య్యాడ‌ని రికార్డులు చెబుతున్నాయి. ఉన్న‌తాధికారులు నోటీసు ఇవ్వ‌డంతో ఆ నోటీసుకి పై విధంగా స‌మాధానం ఇచ్చాడు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు