మందుకొట్టి సముద్రంలో పడవ నడపలేక చావుబతుకుల్లో..

  0
  67

  మద్యం తాగి రోడ్డుమీద వాహనం నడపడం మాత్రమే మీకు తెలుసు.. అయితే మందుకొట్టి సముద్రంలో పడవ నడపలేక చావుబతుకుల్లో ఒడ్డుకు చేరిన వాళ్ళున్నారు.. తాజాగా మంగుళూరులో సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన పడవలో 11 మందిని స్థానికులు రక్షించారు. తమిళనాడుకు చెందిన జాలర్లు మొన్న సముద్రంలో చేపలవేటకు బయలుదేరారు.. బోట్ డ్రైవర్ తో సహా ఆరుగురు ఫుల్ గా మందుకొట్టారు.. కిక్ నసాళానికి ఎక్కడంతో డ్రైవర్ పడవ నడపమని మరొకడ్ని పిలిచాడు.. వాడికి పడవనడపడం చేతకాక అది అటుఇటు తిరిగి , సముద్రంలో కర్ణాటకలో మంగళూరు ఉళ్లాల కూడీ తీరం చేరి , ఒడ్డునున్న రాళ్ళ మధ్యలో చిక్కిపోయింది. రాళ్ల మధ్యలో ఒరిగిపోయింది. జాలర్లకు బయటకు వచ్చే మార్గం లేకపోగా, స్థానికులు ఉదయం గమనించి కాపాడారు. ఉళ్లాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు