ఈ మందు కరోనని ఖతం చేస్తుందా..?

  0
  738

  కరోనా చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) , రెడ్డి ల్యాబ్స్ తో కలిసి ఓ సరికొత్త ఔషధాన్ని తీసుకువచ్చింది. దీని పేరు 2 డీఆక్సీ డి గ్లూకోజ్… సంక్షిప్తంగా 2-డీజీ అంటారు. 2-డీజీ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. ఈ ఔషధాన్ని డీఆర్డీవోకు చెందిన ఓ ప్రయోగశాల, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

  ఈ ఔషధాన్ని వాడిన కరోనా రోగులు వేగంగా కోలుకుంటున్నట్టు క్లినికల్ ట్రయల్స్ నిరూపించినట్టు వెల్లడైంది. 2-డీజీ ఔషధాన్ని తీసుకున్న రోగులకు ఆక్సిజన్ పై ఆధారపడాల్సిన అవసరం రాలేదని గుర్తించారు. ఈ ఔషధంతో చికిత్స పొందిన కరోనా రోగుల్లో చాలామందికి స్వల్పకాలంలోనే ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తోందని డీఆర్డీవో వెల్లడించింది. వైరస్ పెరుగుదలను ఇది కట్టడి చేస్తోందని తెలిపింది. ఇది మార్కెట్ లోకి వస్తే చాలావరకు కరోనా రోగులకు ప్రాణభయం ఉండకపోవచ్చు..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.