కఠినమైన లాక్ డౌన్ ఒక్కటే మార్గం..

  0
  453

  ప్ర‌పంచంలో ఏ దేశంలో లేనివిధంగా భార‌త‌దేశాన్ని క‌బ‌ళిస్తోన్న క‌రోనాని క‌ట్ట‌డి చేయాలంటే దేశాన్ని కొన్ని వారాల పాటు సంపూర్ణంగా లాక్ డౌన్ లో ఉంచాల్సిందేన‌ని డాక్ట‌ర్ ఫౌసీ అభిప్రాయ‌ప‌డ్డారు. అంటువ్యాధుల రంగంలో అత్యంత ప్ర‌తిభావంతుడైన అమెరికాకు చెందిన డాక్ట‌ర్ ఫౌసీ ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ కు ప్ర‌త్యేక‌మైన ఇంట‌ర్వూ ఇచ్చారు. ఏ దేశం కూడా లాక్ డౌన్ విధించాల‌ని కోరుకోద‌ని, అయితే భార‌త‌దేశంలో అసాధార‌ణ ప‌రిస్థితులు త‌గ్గి, క‌రోనా నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడాలంటే దేశంలో లాక్ డౌన్ విధించి తీరాల్సిందేన‌ని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. క‌రోనా ఉదృతంగా ప్ర‌బ‌లుతున్న నేప‌ధ్యంలో లాక్ డౌన్ ఒక్క‌టే మార్గ‌మ‌ని ఇదొక్క‌టే వేగంగా వ్యాధిని అరిక‌ట్ట‌గ‌ల‌ద‌ని చెప్పారు.

  భార‌త‌దేశంలో ఈ వ్యాధి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన స్థాయిని దాటింద‌న్నారు. భార‌త ప్ర‌భుత్వం ఈ వ్యాధి నియంత్ర‌ణలో ఎలా వ్య‌వ‌హ‌రించింద‌న్న విష‌యంలో తాను ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌న‌ని, అలాంటి రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, తాను ప్ర‌జారోగ్యానికి సంబంధించిన వ్య‌క్తిని కాబ‌ట్టి… వైర‌స్ ను ఎలా అరిక‌ట్టాలో స‌ల‌హా మాత్రమే ఇవ్వ‌గ‌ల‌న‌ని చెప్పారు. ప్ర‌పంచంలో ఏ దేశం ఎదుర్కోని విధంగా ఇప్పుడు భార‌త్ ఎదుర్కొంటోంద‌న్నారు. ప్రాణ‌వాయువు కోసం అల్లాడిపోతోంద‌న్నారు. దేశ ప్ర‌జ‌ల ఆర్త‌నాదాలు, ప్రాణాల కోసం పోరాటాలు ఇవ‌న్నీ చూసిన త‌ర్వాత తాను చాలా క‌ల‌త చెందాన‌ని చెప్పారు. వీట‌న్నింటికీ ఏకైక ప‌రిష్కారం లాక్ డౌన్ మాత్ర‌మేన‌ని ఘంటాప‌ధంగా చెప్పారు.

  వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌ర‌గాల్సిందేన‌ని, అయితే అది ఇప్పుడు తీవ్రంగా ఉన్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కాద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఆక్సీజ‌న్, వైద్య సౌక‌ర్యాలు క‌ల్పించ‌డ‌మే త‌క్ష‌ణ క‌ర్త‌వ్య‌మ‌న్నారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా స‌మాంత‌రంగా కొన‌సాగితే, ఈ అంటువ్యాధి మ‌రింత ఉదృతం కాకుండా ఉంటుంద‌ని తెలిపారు. గ‌తేడాది క‌రోనా సంక్షోభంలో భార‌త‌దేశం అనేక దేశాల‌ను ఉదారంగా ఆదుకుంద‌ని, ఇప్పుడు కూడా ప్ర‌పంచ దేశాలు అంత‌కంటే వేగంగా ముందుకు వ‌చ్చి భార‌త్ ను ఆదుకోవాల‌ని కోరారు. ఏ దేశ‌మైనా, ఎంత వైజ్ఞానికంగా అభివృద్ది చెందినా, ఎంత సంప‌న్న దేశ‌మైనా, ఇటువంటి అంటువ్యాధిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేక‌పోతే మార‌ణ‌హోమం త‌ప్ప‌ద‌ని, న‌ష్టం జ‌రిగిన త‌ర్వాత నివార‌ణ చ‌ర్య‌ల‌కు పూనుకుంటే అంత‌కంటే వేగంగా వైర‌స్ వ్యాపిస్తూనే ఉంటుంద‌ని, అందువ‌ల్ల దేశాన్ని పూర్తిగా స్ధంభింప‌చేసి వైర‌స్ ను క‌ట్ట‌డి చేయ‌డమే ప‌రిష్కార‌మార్గ‌మ‌ని సూచించారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.