కరోనా ..నువ్వు చచ్చినా వదలవా.. ??

  0
  1329

  మనిషి బ్రతకడంలో తప్ప.. చావులో తేడా ఉండదని అంటారు. సిరిసంపదలతో బ్రతికేవాడైనా.. తిండి లేక అల్లాడే వాడైనా.. ఇద్దరూ చివరికి చేరాల్సింది స్మశానానికే .. అలా స్మశానానికి చేరాక దహనమో.. ఖననమో ఏదో ఒకటి చేసేస్తారు. అయితే కరోనా పుణ్యమా అని ఇప్పుడు చావు ల్లోనూ తేడాలు వచ్చేశాయి. మామూలు మరణానికి ఒక రేటు.. కరోనాతో చనిపోతే మరో రేటు.. అంటూ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. రాజు, పేద అనే తేడాల్లేని స్మశానంలో కూడా ఇప్పుడు ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని ఓ స్మశాన వాటికలో ఇలా తేడాలు చూపుతూ ప్రకటనలు కూడా దర్శనమిస్తున్నాయి. సాధారణ మరణానికి 2200, కోవిడ్ మరణానికి అయితే 5100 అంటూ గోడపై ప్రకటన కూడా రాసేశారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. కరోనాతో మృతి చెందిన వారిని కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులు కూడా పట్టించుకోకపోవడంతో.. కొందరు ఇష్టానుసారం దోచేస్తున్నారు. ఒక్క కరోనా మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు 25 వేల వరకూ వసూలు చేస్తున్నారు. మనిషి బ్రతకడానికే కాదు.. సరిగ్గా చావాలన్నా కూడా డబ్బు కావాల్సిందే.. ఈ నిజానికి ఇప్పుడు కరోనా మరణాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.