ఇవి కరోనా పాజిటివ్ వాళ్ళను పట్టేస్తాయి..

  0
  87

  శున‌కాల‌కు ఉన్న గ్రాహ‌ణ శ‌క్తి సృష్టిలో మ‌నిషికే కాదు మ‌రే జంతువుకూ లేదు. తాజాగా మెడిక‌ల్ డిటెక్ష‌న్ డాగ్స్, కోవిడ్ పరీక్ష‌ల్లో నూరు శాతం ఫ‌లితాలు సాధించాయి. ల్యాబ్ లో చేసే క‌రోనా ప‌రీక్ష‌ల కంటే కుక్క‌లు వాస‌న‌తో ప‌సిగ‌ట్టిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో నూరు శాతం రిజ‌ల్ట్స్ వ‌చ్చాయి. బ్రిట‌న్ లో 3500 మంది శాంపిల్స్ తీసుకుని ప‌రీక్షించ‌గా మెడిక‌ల్ డిటెక్ష‌న్ డాగ్స్, త‌క్కువ వైర‌ల్ లోడ్ ఉన్న క‌రోనా రోగుల‌ను కూడా గుర్తించాయి. ల‌క్ష‌ణాలు లేని క‌రోనా రోగుల‌ను గుర్తించాయి.

  క‌రోనాలోని రెండు వైర‌స్ ల‌ను క‌నిపెట్ట‌డంతో పాటు కెంట్ వేరియేష‌న్ కూడా ఈ శున‌కాలు ప‌సిగ‌ట్టాయి. కొత్త వైర‌స్ ను క‌నుగొనేందుకు ఈ శున‌కాల‌కు ఎలాంటి శిక్ష‌ణ ఇవ్వ‌లేద‌ని లండ‌న్ స్కూల్ ఆఫ్ మెడిస‌న్ ప్రొఫెస‌ర్ జేమ్స్ లోగ‌న్ చెప్పారు. దీంతో మెడిక‌ల్ డిటెక్ష‌న్ డాగ్స్, క‌రోనా వైర‌స్ లోని ఏ ర‌క‌మైన వైర‌స్ ఉన్నా క‌నిపెట్ట‌గ‌ల సామ‌ర్ద్యాలున్నాయ‌ని తాము గుర్తించామ‌న్నారు. ఈ ప‌రీక్ష‌ల‌ను ఎందుకు చేస్తున్నారో తెలుసా ?

   


  రాబోయే కాలంలో ఎయిర్ పోర్టులు, స్పోర్ట్స్ స్టేడియం, రైల్వేస్టేష‌న్ల‌లో మెడిక‌ల్ డిటెక్ష‌న్ డాగ్స్ ద్వారా క‌రోనా వైర‌స్ ఉన్న రోగుల‌ను గుర్తించేందుకు ఈ ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే మాద‌క ద్ర‌వ్యాలు, పేలుడు ప‌దార్ధాల‌ను రైల్వేస్టేష‌న్లు, ఎయిర్ పోర్టులలో పోలీస్ డాగ్స్ స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేస్తున్నాయి. ఈ మెడిక‌ల్ డిటెక్ష‌న్ డాగ్స్ ఇది వ‌ర‌కే క్యాన్స‌ర్, టైకోన్ డ‌యాబెటీస్, పార్కిన్ స‌న్ వంటి వ్యాధుల్లో నూటికి నూరు శాతం ఖ‌చ్చితమైన ఫ‌లితాల‌ను తెచ్చాయి.

  ఇప్పుడు కోవిడ్ ప‌రీక్ష‌ల్లో 94.03 శాతం ఖ‌చ్చిత‌త్వంతో ఈ శున‌కాలు క‌రోనా వైర‌స్ ఉన్న శాంపిల్స్ ని ప‌సి గ‌ట్టాయి. ఇప్పుడు క‌రోనా టెస్టుల్లో విజ‌యం సాధించిన ఈ శున‌కాల పేర్లు మిల్లీ, లెక్సీ, యాష‌ర్, కిప్, త‌లా మ‌రియు మార్లో. ఆర్టీపీసీఆర్ టెస్టుల కంటే వేగంగా ఇవి క‌రోనా వైర‌స్ ఉన్న వ్య‌క్తుల‌ను క‌ని పెట్ట‌గ‌ల‌వు. ఇప్పుడున్న అంచ‌నాల‌ను బ‌ట్టి ఎయిర్ పోర్టుల్లో 30 నిమిషాల్లో 300 మంది క‌రోనా వైర‌స్ ఉన్న వ్య‌క్తుల‌ను ఈ శున‌కాలు గుర్తించ‌గ‌ల‌వు. ఇవి గుర్తించిన వారిని వేరు చేసి వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు