ఇంజెక్షన్ లేదని ఇలా తలతిక్క పనులా ..?

  0
  345

  కేంద్రప్రభుత్వ తలతిక్క విధానాలు కరోనా రోగులకు శాపాలవుతున్నాయని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇంజెక్షన్లు ఇవ్వకుండా రోగులను చంపాలనుకుంటున్నారా అని నిలదీసింది. రెమిడీస్ వీర్ ఇంజెక్షన్ల విషయంలో ప్రొటొకాల్స్ ఎందుకు మార్చారని నిలదీసింది. ఆక్సిజన్ పెట్టిన పేషేంట్లకే రెమిడీస్ వీర్ ఇవ్వాలన్న నిబంధన ఏ మెడికల్ ప్రోటోకాల్లో ఉందొ చెప్పాలని న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా సింగ్ నిలదీశారు. రెమిడీస్ వీర్ కొరత ఉందన్న సాకుతో ఇలాంటి చెత్త ఆలోచనలు చెయ్యొద్దని స్పష్టం చేశారు. ఇంజెక్షన్ కొరత తీర్చే ప్రయత్నం చెయ్యాలే తప్ప , అవసరమైన రోగులకు ఇవ్వకుండా ప్రొటొకాల్స్ ఇవ్వడం మంచిది కాదన్నారు. ఒక న్యాయవాది తనకు మూడు రెమిడీస్ వీర్ ఇంజెక్షన్లు ఇచ్చి ఆపేశారని , హైకోర్టులో వేసిన కేసుపై ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాలమేరకు ఆయనకు మిగిలిన మూడు ఇంజెక్షన్లు వేశారు..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.