మా అమ్మానాన్న విడిపోయి మంచిచేసారు..

    0
    70

    తల్లిదండ్రులు విడిపోతే ఆ బిడ్డలు అనాథలుగా మిగిలిపోతారు. సింగిల్ పేరెంట్ చైల్డ్ గా ఎవరో ఒకరి వద్దే పెరుగుతారు. అలాంటి వారంతా తమ తల్లిదండ్రులు కలిసుంటే ఎంతో బాగుండేది కదా అంటుంటారు. కానీ హీరోయిన్ శృతి హాసన్ మాత్రం తన తల్లిదండ్రులు విడిపోవడమే మంచిదని తేల్చేసారు. తన తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక.. విడిపోయి హాయిగా ఉన్నారని చెప్పారు.

     

    “వారు విడిపోయినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వారికి ఇష్టం లేకపోయినా ఏవేవో కారణాలు చెప్పి బలవంతంగా కలిసుండేలా చేయడం కరెక్ట్‌ కాదు. వారిద్దరూ అద్భుతమైన వ్యక్తులు. నా చిన్నవయసులోనే వారు ఒకరికొకరు దూరమయ్యారు. అదంతా చాలా ఈజీగా జరిగిపోయింది. అయినా కలిసి ఉన్నప్పటికంటే కూడా విడిపోయాకే వారు హ్యాపీగా ఉంటున్నారు” అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శృతి హాసన్. తాను ఎక్కువగా తండ్రి కమల్‌ కు దగ్గరగా ఉంటానని అన్నారు.

     

    కమల్‌ హాసన్‌ మొదటి సారి డ్యాన్సర్‌ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు. వారి బంధం పదేళ్లపాటు బాగానే ఉన్నప్పటికీ 1988లో విడాకులతో బీటలు వారింది. తర్వాత కమల్‌ సారికను ప్రేమించి 1980లో పెళ్లి చేసుకున్నారు. వీరికి శృతిహాసన్, అక్షర సంతానం. ఆ తర్వాత కమల్‌, సారిక మధ్య మనస్పర్థలు రావడంతో 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం నటి గౌతమితో కమల్ సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. కమల్-గౌతమి కూడా తర్వాత విడిపోయారు.

    ఇవీ చదవండి..

    ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

    వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

    కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

    రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు