మా అమ్మ ఫోన్లో మా జీవితం ఉంది..

  0
  833

  కోవిడ్ మార‌ణ హోమంలో ఓ తొమ్మిదేళ్ళ బాలిక త‌ల్లి మొబైల్ కోసం చేస్తున్న పోరాటం నిజంగా అద్భుతం. ఇది క‌న్నీరు తెప్పించే హృద‌య విదార‌క దృశ్యం. పోయిన మొబైల్ ఫోన్ కోసం ఇంత రాద్దాంతం అవ‌స‌ర‌మా ? అని మ‌నం అనుకుంటే… దీని వెన‌క ఓ జీవితం, ఒక క‌న్నీటి క‌ధ‌.. మ‌ర‌పురాని జ్ఞాప‌కాలు.. మిగిలున్నాయి.

  హృతీక్ష అనే 9 ఏళ్ళ బాలిక త‌ల్లి ప్ర‌భ కోవిడ్ సోకి మ‌డికెర టౌన్ లోని ఆస్ప‌త్రిలో చ‌నిపోయింది. అయితే మృత‌దేహం వ‌ద్ద‌ ఉన్న సెల్ ఫోన్ ను ఆస్ప‌త్రి సిబ్బంది కొట్టేశారు. చ‌నిపోయిన హృతీక్ష త‌ల్లి ప్ర‌భ రోజువారీ కూలీగా ప‌ని చేస్తూ బ‌తికేది. ఇప్పుడు ఆ ఫోన్ కోసం హృతీక్ష పోరాటం చేస్తోంది. హృతీక్ష చేస్తోన్న పోరాటం, ఆమె ఆవేద‌న చాలా మంది కొత్త ఫోన్ కొనిస్తామ‌ని ముందుకొచ్చినా, ఆ చిన్నారి మ‌న‌సు కుదుట‌ప‌డ‌డం లేదు.

  త‌న త‌ల్లి ఫోన్ లో చాలా ఫోటోలున్నాయ‌ని, త‌మ‌తో త‌ల్లి తీసుకున్న ఫోటోలు, తాను త‌ల్లికి తీసిన ఫోటోలు ఉన్నాయ‌ని, అందువ‌ల్ల త‌న‌కు కొత్త ఫోన్ కొనివ్వ‌డం కాద‌ని, పాత ఫోన్ లో త‌న త‌ల్లి ఫోటోల కోస‌మే బాధ ప‌డుతున్నాన‌ని ఆ పాప చెబుతోంది.

  ఆ పాప ఆవేద‌న, దాని వెన‌క ఉన్న త‌ల్లి ప్రేమ‌ను గుర్తించిన పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఫిర్యాదు తీసుకుని ఫోన్ కోసం ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. ఈలోగా సోష‌ల్ మీడియాలో ఆ పాప పోరాటం గురించి తెలుసుకున్న కొంత‌మంది కొత్త ఫోన్ కొనిచ్చినా, త‌న‌కు త‌న త‌ల్లి ఫోన్ మాత్ర‌మే కావాల‌ని ఏడుస్తోంది. ఆ ఫోన్ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వ‌ర‌కు పోలీస్ స్టేష‌న్ నుంచి క‌ద‌ల‌న‌ని చెబుతోంది. త‌న త‌ల్లి ఫోన్ త‌న‌కు ఇచ్చేస్తే, త‌న‌కు బ‌హుక‌రించిన కొత్త ఫోన్ కూడా ఇచ్చేస్తానని చెబుతోంది. త‌ల్లి మీద ఆ పాప‌కు ఉన్న ప్రేమ‌… మ‌ర‌పురాని త‌ల్లి ప్రేమ‌కు నిద‌ర్శ‌నం.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు