తుఫాన్ ముంచుకొస్తోంది..

  0
  1384

  కరోనా కల్లోలంలో అల్లాడిపోతున్న కేరళ, కర్ణాటక, రాష్ట్రాలకు మరో ప్రమాదం ముంచుకొస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమదిశగా కదులుతోంది. ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది. దీనికి తవుక్టే అనే పేరు పెట్టారు. బర్మా భాషలో తవుక్టే అంటే గికో బల్లీ అని అర్ధం. ఈ బల్లి అరుపు చాలా భీకరంగా ఉంటుంది. అందుకే ఈ తుఫానుకు ఈ పేరు పెట్టారు. ఈనెల 15 నాటికి వాయువ్య దిశగా ప్రయాణించి .. కేరళ, లక్షదీప్ తీరాలను తాకే అవకాశం ఉంది. దీనివలన కర్ణాటక, తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మహారాష్ట్రలో కూడా ఈ తుఫాన్ ప్రభావము ఉండవచ్చని చెప్పారు. సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని కూడా హెచ్చరించారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.