సైక్లింగ్ తో సెక్స్ బలహీనత వస్తుందా .?

    0
    152

    సైక్లింగ్ వ‌ల్ల ఆరోగ్య ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాలున్నా సెక్స్ ప‌రంగా కొన్ని ఇబ్బందులున్నాయన్న ప‌రిశోధ‌న‌ల్లో ఇప్పుడు మ‌రో విష‌యం బైట ప‌డింది. సైక్లింగ్ వ‌ల్ల జ‌న‌నేంద్రియాల వ‌ద్ద న‌రాల ఒత్తిడి క‌లిసి మ‌గ‌వాళ్ల‌ల్లో లైంగిక ప‌ర‌మైన శ‌క్తి స‌న్న‌గిల్లుతుంద‌న్న ప‌రిశోధ‌న‌ల‌కు తాజాగా మ‌రో అంశం తోడ‌యింది. సైక్లింగ్ చేసే మ‌హిళ‌ల్లో సగం మందికి పైగా జ‌న‌నేంద్రియ భాగంలో న‌రంపై క‌లిగే ఒత్తిడి కార‌ణంగా లైంగిక కోరిక‌పై ఆస‌క్తి స‌న్న‌గిల్లుతుంద‌ని గ‌మ‌నించారు. దీన్నే నెర్వ్ కంప్రెష‌న్ అంటారు. సీటు మీద ఎక్కువ సేపు కూర్చుని తొక్క‌డం వ‌ల్ల తిమ్మిర్లు ఏర్ప‌డి, క్ర‌మంగా అది పెరుగుతూ వ‌చ్చి లైంగిక కోరిక‌ల‌పై అనాస‌క్తి చూపుతార‌ని తేల్చారు.

    బ్రిట‌న్, అమెరికా, కెన‌డా, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్ దేశాల్లో 875 మంది సైక్లింగ్ చేసే మ‌హిళ‌ల‌పై ఈ ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించారు. హ్యాండిల్ బార్ సీటు కంటే కింద ఉండే సైకిళ్ళను తొక్క‌డం వ‌ల్ల ఇలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ని శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివ‌ర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేసిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అందువ‌ల్ల సైకిళ్ళ కంపెనీలు కూడా సీటు త‌యారీలో, హ్యాండిళ్ళ త‌యారీలో కాస్త శ్ర‌ద్ద తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. 200 ఏళ్ళ క్రితం త‌యారైన ఈ సైకిల్ త‌యారీలో క్ర‌మ‌క్ర‌మంగా మార్పులు వ‌చ్చాయ‌ని, వివిధ ర‌కాల డిజైన్లు త‌యారు చేస్తున్నార‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే సైకిళ్ళకు హ్యాండిల్ బార్ కింద ఉండేలా త‌యారు చేశార‌ని, వీటివ‌ల్లే నెర్వ్ కంప్రెష‌న్ వ‌స్తోంద‌ని తేల్చారు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..