కన్నకూతురు పట్ల ఇంత కర్కశమా..?

  0
  346

  కూతురి వ‌ల్ల త‌న‌కు అదృష్టం క‌లిసి రాలేద‌ని దుర్మార్గుడైన ఓ తండ్రి, క‌న్న‌కూతురికి ఆహారం పెట్ట‌కుండా చ‌నిపోయేలా చేశాడు. మ‌హారాష్ట్రంలోని జ‌ల‌గాం జిల్లా ర‌జాకాల‌నీలో ఈ ఘోరం జ‌రిగింది. రెహానా అనే 11 ఏళ్ళ బాలిక‌కు తండ్రి జావేద్ కొన్ని రోజుల పాటు అన్న‌పానీయాలు అందించ‌కుండా ఒక గ‌దిలోనే ర‌హ‌స్యంగా బంధించాడు. ఆ త‌ర్వాత ఆక‌లితో బ‌క్క‌చిక్కి ఆ బాలిక గ‌దిలోనే చ‌నిపోయింది. చ‌నిపోయిన కూతురిని ర‌హ‌స్యంగా పూడ్చివేశాడు. బాలిక చిన్నాన్నకు అనుమానం వ‌చ్చి ఆ బాలిక గురించి విచారించి, విష‌యాన్ని పోలీసుల‌కు చెప్పాడు. దీంతో జావెద్ త‌న భార్య‌తో క‌లిసి ప‌రార‌య్యాడు. విచార‌ణ‌లో బాలిక శ‌వం ఎక్క‌డ పూడ్చి పెట్టారో తెలుసుకుని పోస్టుమార్టం చేశారు. పోస్టుమార్టంలో ఆ బాలిక ఆక‌లితో అల‌మ‌టించి చ‌నిపోయింద‌ని తెలిసింది. ఆ ఇంటి చుట్టుప‌క్క‌ల వారిని విచారిస్తే, అమ్మాయిల‌ను ఇలా ఆక‌లితో అల‌మ‌టించి చంపేస్తున్న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయ‌ని తేలిసింది. అమ్మాయి వ‌ల్ల అదృష్టం కలిసి రాలేద‌నే, తండ్రి జావెద్ ఇలా చేశాడ‌ని చెబుతున్నారు. ఆడ‌పిల్ల‌లు క‌న్న త‌ల్లుల‌కు విడాకులు ఇచ్చిన సంద‌ర్భాలు కూడా ఈ ప్రాంతంలో జ‌రిగాయ‌ని తేలింది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.