ఖతర్నాక్ పెళ్లి కూతురు. భర్తను కిడ్నాప్ చేసింది.

  0
  899

  ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్లిపేరుతో పెళ్లికూతుళ్ల మోసాలు ఎక్కువయ్యాయి.. అమ్మాయిలు దొరక్క , వెనకముందూ చూడకుండా అబ్బాయిలు , పెళ్లి కూతుళ్లకోసం ఎగబడుతున్నారు. దీంతో పెళ్ళైన తర్వాత , ఉన్నదంతా మూటగట్టుకుపోయే పెళ్లికూతుళ్ళు సంఘటనలు ఎక్కువయ్యాయి.. ఇప్పుడు మరో విచిత్రమైన కేసు పోలీసుల మతిపోగొట్టింది. పెళ్ళైన రెండో రోజే పెళ్లికూతురు , పెళ్ళికొడుకుని కిడ్నాప్ చేసి 20 లక్షలు డబ్బు డిమాండ్ చేసింది. లేదంటే , మీ అబ్బాయిని చంపేస్తామంటూ బెదిరించింది.

  గ్వాలియర్ కు చెందిన వికాస్ అనే యువకుడు , మాట్రిమోనీ సైట్ లో ప్రొఫైల్ పెట్టారు. జార్ఖండ్ రాష్ట్రం రాంచీ నుంచి నమ్రత అనే అమ్మాయి తాను రెడీ అంటూ మెసేజ్ పంపింది. దీంతో ఇద్దరూ పెద్దలసమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అత్తగారింటికి భార్యతో కలిసి పోయిన , వికాస్ ను రాంచి లో కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాపర్లలో తాను పెళ్లాడిన నమ్రత భర్తకూడా ఉన్నాడని తెలిసొచ్చింది. దీంతో నమ్రతకు ఇదివరకే పెళ్లయిందని తెలుసుకున్నాడు. మొదట 5 లక్షలు తమకిస్తే వదులుతామని చెప్పారు. మిగిలిన 15 లక్షలు ఒప్పందంప్రకారం ఇవ్వకపోతే , రాంచీ లోనే గృహహింస , వరకట్న వేధింపుల కేసు పెడతానని నమ్రత బెదిరించింది. 5 లక్షలిచ్చి బతుకు జీవుడా అని బయటపడ్డ వికాస్ పోలీసులవద్దకు పరుగెత్తి కేసుపెట్టాడు..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.