బెర్త్ కోసం శవాలు ఎదురుచూపులు ..

  0
  181

  దేశాన్ని క‌కావిక‌లం చేస్తోన్న క‌రోనా విల‌యంలో శ్మ‌శానాల్లో బెర్తులు పెంచాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఆస్ప‌త్రుల్లో బెడ్లు పెంచాల‌న్న ఆందోళ‌న ఒక‌వైపు… పిట్ట‌ల్లా రాలిపోతున్నా క‌రోనా రోగుల ద‌హనం కోసం శ్మ‌శానంలో బెర్తులు పెంచాల్సిన దుస్థితి మ‌రోవైపు… ఇదీ నేటి భార‌త‌దేశ ప‌రిస్థితి. నేటిత‌రంలో క‌నివినీ ఎరుగ‌ని మ‌హావిప‌త్తు ఇది.

  ఢిల్లీలోని ఉత్త‌ర ప్రాంతంలో నిగమ్ బోత్ ఘాట్, ఇంద‌ర్ పురి, టీకే రోడ్, వ‌జీర్ పూర్, బేరివాలాబాగ్, మంగ‌ళ్ పురి ముస్లిం ఖ‌బ‌ర‌స్తాన్ ఈ శ‌శ్మాన వాటిక‌ల్లో 215 బెర్తుల‌ను 400ల‌కి పెంచారు. అయినా శ‌వ ద‌హ‌నాల‌కు ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంది. ద‌క్షిణ ఢిల్లీలో పంజాబీబాగ్, అస్తాల్, లోడీరోడ్, స‌ర‌య్ కాలేఖాన్, లాల్ క్వాన్, ఫిరోజ్ షా కోట్ల శ్మ‌శానాల్లో 210 బెర్తులు ఉండ‌గా, వీటిని 500 ల‌కు చెందారు. తూర్పు ఢిల్లీలోని శ్మ‌శాన‌వాటిక‌ల్లో 48 బెర్తులు ఉండ‌గా, వాటిని 110కి పెంచారు. ఉత్త‌ర ఢిల్లీలో సీమాపురి క్రీమేష‌న్ గ్రౌండులో 26 బెర్తుల‌ను 62కి పెంచారు. అయినా శ్మ‌శానాల వ‌ద్ద క్యూలు పెరుగుతూనే ఉన్నాయి. దీన్నిబ‌ట్టి ఢిల్లీలో క‌రోనాతో రోగుల మ‌ర‌ణాలు ఎంత ఎక్కువ‌గా ఉన్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు. హాస్పిట‌ల్ వ‌ద్ద బెడ్లు దొర‌క్క‌, ఆక్సీజ‌న్ అంద‌క రోగులు ప‌డుతున్న పాట్లు ద‌య‌నీయంగా, హృద‌య విదార‌కంగా ఉన్నాయి.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.