పాపం ..ఆ హీరోయిన్ ముక్కు ఇలా అయిపొయింది.. ఏమి జరిగిందో తెలుసా..?

  0
  433

   

  తనకు అంతకంటే మంచిముక్కు కావాలని ఆశపడింది.

  పాపం ..ఆ అందాల నటి ముక్కు ఇలా అయిపొయింది. సినిమాల్లో మరింత అందంగా కనపడాలని లియూ అనే నటి తాపత్రయపడింది. ఆమె మామూలుగానే అందమైన నటి. అయితే పులినిచూసి నక్క వాతపెట్టుకున్నట్టు . మరోనటికి , తనకన్నా ముక్కు బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు రావడంతో ఆమె చిన్నబుచ్చుకుంది. తనకు అంతకంటే మంచిముక్కు కావాలని ఆశపడింది.

  https://au.news.yahoo.com/chinese-star-gao-liu-shares-012018323.html

   

  ఆపరేషన్ తరువాత , ఆమె అనుకున్నట్టు జరగలేదు.

   

  ఇతర తారల్లాగే కాస్మెటిక్ సర్జరీకి ప్లాన్ చేసింది. ఇందుకోసం సినిమా కాల్షీట్లు కూడా మూడునెలలు వాయిదా వేసింది. లియూ మంచి సింగర్ కూడా . ప్రపంచంలోనే మంచిపేరున్న కాస్మెటిక్ హాస్పిటల్లో సర్జరీకి ప్లాన్ చేసింది. చైనాలోని గువాంగ్జూ లోని హాస్పిటల్లో చేరి ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అయితే ఆపరేషన్ తరువాత , ఆమె అనుకున్నట్టు జరగలేదు. ఆపరేషన్ చేసిన భాగంలో నల్లగా కమిలిపోయింది. బంగారంటి ముక్కు కాస్తా ముదనష్టంగా తయారైంది.

  ఇంకెవరూ కాస్మెటిక్ సర్జరీలు చేసుకోవద్దని

   

  తనకు తానూ అద్దంలో చూసి బోరున ఏడ్చేసింది.వేరే డాక్టర్లను కలిస్తే ముక్కుకు ఆపరేషన్ చేసిన భాగంలో కణజాలానికి రక్త ప్రసరణ జరగకపోవడంతో ఆ భాగంలో మృతకణజాలం పేరుకుపోయి , నెక్రోసిస్ అనే వ్యాధి సోకిందని చెప్పారు. ఉన్నముక్కు అందాన్ని పోగొట్టుకొని , ఇప్పుడు సినిమాల్లో ఛాన్సులు వస్తాయోరావో అన్న దిగులుతో లియూ భోరుమంటుంది … ఇంకెవరూ కాస్మెటిక్ సర్జరీలు చేసుకోవద్దని సలహా చెబుతుంది..

  ఇది కూడా చదవండి..

  https://ndnnews.in/11pocsoactonloverschennaihighcourt334/