బెంగళూరులో కరోనా బాంబ్ పేలింది..

  0
  1379

  కరోనా మహమ్మారి శాంతిస్తుందన్న వార్తల నేపథ్యంలో బెంగళూరులో ఒక్కసారిగా కరోనా బాంబు పేలింది. ఒక అపార్ట్ మెంట్ లో జరిగిన పార్టీలో 103మందికి కరోనా సోకింది. ఈనెల 4వతేదీ బొమ్మనహళ్లిలోని అపార్ట్ మెంట్ ఆవరణలో జరిగిన పార్టీలో అపార్ట్ మెంట్ వాసులంతా పాల్గొన్నారు. ఆ తర్వాత వారిలో కొంతమంది డెహ్రాడూన్ యాత్రకు పోవాలనుకున్నారు. ఇందుకోసం కరోనా టెస్ట్ లు కూడా చేయించుకున్నారు. ఆ ఫలితాలు వారం క్రితం వచ్చాయి. వారిలో చాలామందికి కరోనా ఉందని తేలడంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.

  అపార్ట్ మెంట్ లో ఉన్న వాళ్లందరికీ కరోనా టెస్ట్ లు చేయించారు. 103మందికి పాజిటివ్ గా తేలింది. వీరిలో 96మంది 60ఏళ్లకు పైబడినవారే. అందరినీ ఐసోలేషన్ లో ఉంచి, అపార్ట్ మెంట్ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించేశారు. అపార్ట్ మెంట్ లో ఒక్కరిని కూడా బయటకు పోనీయకుండా అవసరమైన వస్తువులు ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ఏరకమైన కరోనా వీరికి సోకిందని తెలుసుకునేందుకు ఈ నమూనాలను నిమ్ హాన్స్ కి పంపించారు.

  బెంగళూరులో ఈ వార్త గుప్పుమనడంతో మళ్లీ పార్టీలు, పబ్బులు, క్లబ్బులు అంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడిప్పుడే హోటళ్లకు పరుగులు తీస్తున్నవారు, మళ్లీ వెనక్కి తగ్గుతున్నారు. కరోనా ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉందనడానికి ఇదో సాక్ష్యం.

  ఇవీ చదవండి:

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..? 

  షర్మిల ఎవరు వదిలిన బాణం..?

  రాహువు అంటే మనకు భయం – ఆ దేశంలో భక్తి.. ఎక్కడచూసినా నిత్య పూజలే.