ఐదో క్లాస్ నుంచే స్కూల్లో కండోమ్స్. ఏమిటిది?

  0
  2447

  ఐదో తరగతినుంచి స్కూల్స్ లో కండోమ్స్ అందుబాటులో ఉంచాలన్న ఒక నిర్ణయంపై అమెరికాలో తీవ్రమైన చర్చ జరుగుతొంది.. చికాగో పబ్లిక్ స్కూల్స్ సొసైటీ , ఈ నెల మూడో వారం నుంచి స్కూల్స్ ప్రారంభించనుంది. స్కూల్స్ లో కండోమ్స్ , రుతుస్రావానికి సంబందించిన పాడ్స్ ఉంచాలని నిర్ణయించింది. లైంగిక పరమైన అవగాహన కోసమే ఈ పనిచేస్తున్నట్టు తెలిపింది. ఇటీవల కాలంలో 12 ఏళ్లకే ఆడపిల్లలు గర్భం దాల్చడం , డేటింగ్ అంటూ ప్రొసీడ్ కావడం లాంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. స్కూల్స్ లో శానిటైజర్లతో పాటు , కండోమ్స్ కూడా అందుబాటులో ఉంచాలన్న నిర్ణయంపై తీవ్ర దుమారం రేగినా , చికాగో పబ్లిక్ స్కూల్స్ సొసైటీ మాత్రం , తమ నిర్ణయం సరైనదేనని సమర్ధించుకుంది. దీన్ని వ్యతిరేకించే వారు మాత్రం , ఇది పరోక్షంగా చిన్నపిల్లల మనసును చెడగొట్టే విధానమని దుయ్యబట్టింది. లైంగికపరమైన అవగాహన అంటే , పెళ్లి , పిల్లలను కనే వయసు , చిన్న వయసులోనే సెక్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలియజెయ్యాలని సూచించింది. అలా కాకుండా కండోమ్స్ ను అందుబాటులో ఉంచితే , పిల్లల మనస్సులో లేని భావన కలిగించినట్టేనని పేర్కొన్నారు. 12 ఏళ్ళకే చికాగోలో ఆడపిల్లలలు ఫిఫ్త్ గ్రేడ్ కు వస్తారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.