మోహన్ బాబుకి జగన్ ఆహ్వానం అందకుండా చేసింది ఎవరు..?

  0
  99

  మోహన్ బాబుకి జగన్ ఆహ్వానం అందకుండా చేసింది ఎవరు..?

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ నటుడు మంచ విష్ణు సీఎం జగన్ ని కలిశారు. తాడేపల్లిలో సీఎంని కలిసిన తర్వాత మంచు విష్ణు బయటకి వచ్చి మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపాయి. ఇటీవల చిరంజీవి నేతృత్వంలో ఓ బృందం సీఎం జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఆ బృందంలో మోహన్ బాబు కుటుంబానికి చెందినవారు లేరు, కనీసం టాలీవుడ్ పెద్దగా మోహన్ బాబు వస్తారేమో అని అనుకున్నారంతా, కానీ రాలేదు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విష్ణు వస్తారనుకన్నా రాలేదు. అయితే దీనికి కారణం ఇండస్ట్రీలోని కొందరు పెద్దలేనంటూ విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబుకి ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉందని, కానీ కొందరు పెద్దలు ఆ ఆహ్వానం అందకుండా చేశారని మండిపడ్డారు విష్ణు. నాన్నగారిని ఎవరు అవాయిడ్ చేశారనేది త్వరలో చర్చిస్తానని అన్నారు విష్ణు.

  తిరుపతిలో సినిమా స్టూడియో కడతామని, అందుకు ప్రభుత్వ సహకారం కోసం మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పారు. తిరుపతిలోని విద్యానికేతన్‌ ఇప్పుడు యూనివర్శిటీ అయిందని, అందులో ఫిల్మ్‌ కోర్సులు మొదలుపెడతామన్నారు. జగన్‌ తో వ్యక్తిగత విషయాలు మాట్లాడకున్నామని చెప్పారు.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో తనకి అందరూ సపోర్ట్ చేయడం వల్లే ఎదుటివారిని చిత్తుచిత్తుగా ఓడించానని అన్నారు విష్ణు. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్లకు కూడా ఆ ఎన్నికల తీర్పుతో ఓ జవాబు ఇచ్చానన్నారు. మా ఎన్నికల్లో వచ్చిన వివాదాల వల్లే తనకు ఆహ్వానం రాలేదనడం అవాస్తవం అని అన్నారు విష్ణు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..