మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ పార్టీ కాటి సీను

  0
  148

  కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో కాటి సీన్ కి చేరుకుంది. ఒకప్పుడు రాష్ట్రాన్ని అవిచ్ఛిన్నంగా, అప్రతిహతంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి రూపంలో సరైన మొగుడు దొరికాడు. రాష్ట్ర విభజన పాపం, జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు, రెండూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో సర్వనాశనం చేశాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతమంది కౌన్సిలర్లను గెలిపించుకుందో తెలిస్తే, ఆశ్చర్యం కాదు, కాంగ్రెస్ పార్టీ శత్రువులకు కూడా ఏడుపు వస్తుంది. ఆ పార్టీ అంత దయనీయ పరిస్థితుల్లో పడిపోయింది.

  మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక్క కౌన్సిలర్ స్థానాన్ని దక్కించుకుంది. ఓట్ల శాతానికి వస్తే 0.62శాతం ఓట్లు సాధించి సిగ్గుపోయే విధంగా తయారైంది. ఒక జాతీయ పార్టీ, ఏడేళ్ల క్రితం వరకు తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్, మున్సిపల్ ఎన్నికలనాటికి మన రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారిపోయింది.

  మొత్తం పోలైన 47,46,000 ఓట్లలో ఆ పార్టీకి 29,500 ఓట్లు వచ్చాయి. సీపీఐ, సీపీఎం కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకంటే జనసేనకే ఎక్కువ సీట్లు రావడం కూడా గమనించదగ్గ అంశం. జనసేనకు 25సీట్లు వస్తే, బీజేపీకి 9సీట్లు వచ్చాయి. జనసేనకు 4.67శాతం ఓట్లు పోలయితే, బీజేపీకి 2.41శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వైసీపీకి 52.63శాతం ఓట్లు పోలయితే, టీడీపీకి 30.73శాతం ఓట్లు పోలయ్యాయి.

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??