విమానం ఎక్కుతూ ఇంజిన్లో చిల్లర విసిరి …

  0
  843

  గంగా, గోదావ‌రి, తుంగ‌భ‌ద్ర‌, కృష్ణా.. ఇలా మ‌న దేశంలో న‌దుల‌ను బ‌స్సుల్లో, రైళ్ళ‌ల్లో దాటేట‌ప్పుడు బ్రిడ్జీల మీద నుంచి న‌దిలోకి భ‌క్తులు చిల్ల‌ర వేస్తుంటారు. ఇలా వేయ‌డం ద్వారా శుభం జ‌రుగుతుంద‌ని భార‌తీయులు భావిస్తారు. అయితే చైనాలో మాత్రం ఓ వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. విమానం ఎక్క‌డానికి వ‌చ్చిన ఓ వ్య‌క్తి… ప్రొఫ‌ల్ల‌ర్ (విమానం రెక్క‌ల కింద ఉండే ఫ్యాన్లు) లో కాయిన్లు వేశాడు. దీంతో పైకి ఎగ‌రాల్సిన ఫ్లైట్ ని ఆపేశారు. చైనాలో సెంట్ర‌ల్ షాండాగ్ లో విఫాంగ్ ఎయిర్ పోర్టులో ఘ‌ట‌న జ‌రిగింది.

  వాంగ్ అనే వ్య‌క్తి తొలిసారి విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకి వ‌చ్చాడు. విమానం ఎక్కే ముందు ఎర్ర‌ని వ‌స్త్రంలో ఆరు కాయిన్లు పెట్టి ప్రొఫ‌ల్ల‌ర్ లోరి విసిరేశాడు. దీన్ని గ‌మ‌నించిన విమాన‌యాన సిబ్బంది ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎందుకిలా చేశావంటూ నిల‌దీశారు. మొద‌టిసారి విమానం ఎక్కుతున్నాను. దేవుడికి దండం పెట్టుకుని కాయిన్లు విసిరేశాను అంటూ వాంగ్ చెప్ప‌డంతో విన్న‌వారంతా ఖంగుతిన్నారు. ఆ స‌మ‌యంలో వాంగ్ తో పాటు 148 మంది ప్యాసింజ‌ర్లు ట్రావెల్ చేయాల్సివుంది. అత‌ను చేసిన ప‌నికిమాలిన ప‌నితో విమానాన్ని నిలిపివేశారు. మ‌రుస‌టి రోజు ప్ర‌యాణీకుల‌ను మ‌రో ఫ్లైట్ లో త‌ర‌లించారు అధికారులు. వాంగ్ ని మాత్రం అరెస్టు చేశారు. గ‌త సంవ‌త్స‌రం కూడా ఇలాగే ఓ వ్య‌క్తి చేయ‌డంతో అత‌నిని అరెస్టు చేశారు. భారీ ఫైన్ కూడా విధించారు. మ‌న‌ ఇండియ‌న్ క‌రెన్సీలో చెప్పాలంటే 12 ల‌క్ష‌ల ఫైన్ విధించారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.