ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జగన్ వరుస భేటీలు..

  0
  118

  ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం ఆయన కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తో భేటీ అయ్యారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మిథున్‌ రెడ్డి, అవినాష్ రెడ్డి, గురుమూర్తి ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అంశాలపై సీఎం జగన్‌ మంత్రితో చర్చించారు.

  కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలసి పోలవరం ప్రాజెక్ట్ పురోగతిని వివరించారు జగన్. పోలవరం ప్రాజెక్ట్‌ బకాయిల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాత్రికి నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటికావాల్సి ఉంది. ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం జగన్ తిరుగు ప్రయాణం అవుతారు.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..