మూసేయండి.. అమర్ రాజాకు షాక్.

  0
  1005

  దేశంలో ప్ర‌సిద్ది చెందిన అమ‌ర్ రాజా బ్యాట‌రీల కంపెనీల‌ను మూసివేయాల‌ని ఏపీ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. తిరుప‌తి స‌మీపంలోని క‌ర‌కంబాడీ మ‌రియు చిత్తూరు ద‌గ్గ‌ర నూనెగుండ్ల‌ప‌ల్లిలో ఉన్న రెండు ఫ్యాక్ట‌రీల‌ను మూసి వేయాల‌ని ఆదేశించింది. గ‌త‌నెల 30వ తేదీ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు నుంచి ఆదేశాలు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కంపెనీ ప్ర‌తినిధులు చ‌ర్చిస్తున్నాడు. అయినా పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు నిబంధ‌న‌ల ప్ర‌కారం ఫ్యాక్ట‌రీలు న‌డ‌ప‌కుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ, వెంట‌నే కంపెనీలు మూసి వేయాల‌ని ఆదేశాలిచ్చింది. తాత్కాలిక ప్రాతిప‌దిక‌పై తాము పొల్యూష‌న్ కంట్రోల్ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని, పూర్తిగా అమ‌లు చేయాలంటే కొన్ని కీల‌క సర్వీసుల సేవ‌ల‌కు అంత‌రాయం క‌లుగుతుంద‌ని, అందువ‌ల్ల ఫ్యాక్ట‌రీల‌ను ఆప‌కుండా ప‌నులు చేయాల్సివుంద‌ని అమ‌ర్ రాజా పేర్కొంది. కొన్ని ఆస్ప‌త్రులు, భార‌త ర‌క్ష‌ణ శాఖ‌, టెలికం శాఖ వంటి కీల‌క రంగాల‌కు బ్యాట‌రీల‌ను ఉత్ప‌త్తి చేస్తూ సేవ‌లందిస్తున్నామ‌ని, ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో కోవిడ్ విజృంభ‌ణ దృష్ట్యా ఆ రంగాల‌కు అంత‌రాయం క‌లిగించ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతోనే తాము ఉత్ప‌త్తుల‌ను కొన‌సాగిస్తున్నామ‌ని ఆ సంస్థ పేర్కొంది. వాతావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, ఆరోగ్య‌, భ‌ద్ర‌త త‌దిత‌ర అంశాల‌తో త‌మ కంపెనీకి అవార్డులు, రివార్డులు కూడా వ‌చ్చాయ‌ని చెప్పింది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.