గుట్కా కావాలా ..? భార్య కావాలా..??

  0
  1685

  పెళ్ళాంకన్నా , పెళ్ళాం కి ఇచ్చిన మాట కన్నా , గుట్కా నే అతడికి ముఖ్యంకావడం , అతడిని ముప్పతిప్పలు పెట్టింది.. గుట్కాలకు అలవాటు పడ్డవారు , సామాన్యంగా అలవాటు మానుకోలేరు.. గుళ్లోప్రమాణాలు , బాసలు ఇవేవి వారిని గుట్కాకు దూరంచేయలేవు.. ప్రాణం పోతుందని భయం ఉంటె తప్ప. అలాంటిది కార్వా చౌత్ పర్వదినాలలో , భర్తల బాగుకోసం భార్యలు వ్రతాలు చేస్తారు. సునీల్ శర్మ అనే వ్యక్తి తన భార్య తనకోసం వ్రతంచేసి , మొక్కులు చెల్లించేందుకు గుడికొచ్చింది.. పూజతరువాత , భర్త , నీకేమికావాలో కోరుకో అన్నాడు.. భార్య , నాకేమీ వద్దు , నువ్వు గుట్కా మానుతానని మాటివ్వమంది .. భర్త సరేనన్నాడు.. ఇద్దరూ కలిసి ఊరికి తిరిగిపోయేందుకు గ్వాలియర్ బస్టాండ్ కి చేరుకున్నారు. బస్సు ఎక్కేముందు , భర్త ఇదే లాస్ట్ అంటూ గుట్కా వేసుకున్నాడు.. దీంతో భార్య సీతామాయి అలిగి వెళ్ళిపోయింది. వాష్ రూమ్ కి వెళ్లిఉంటుందని భావించిన , భర్తకు 10 నిమిషాల్లో వాట్సాప్ మెసేజ్ వచ్చింది.. నేను చచ్చిపోతున్నా.. నువ్వు గుట్కా వేసుకో అని.. దీంతో భయపడ్డ భర్త , పోలీసులవద్దకు పరుగులుతీసాడు.. ఆగమేఘాలమీద స్పందించిన పోలీసులు , చివరకు ఆమెను గ్వాలియర్ రైల్వే స్టేషన్లో కనిపెట్టి భర్తకు అప్పగించారు. ఇంకెప్పుడు గుట్కా వేసుకోనని భర్త , భార్య పాదాలు పట్టుకొని ప్రమాణం చేసాడు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..