ప్రతి జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్ ప్లాంట్స్..

  0
  41

  కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్ట‌ర్ సోనూసూద్ ఈ విష‌యంలో ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. జిల్లాల స్థాయుల్లో ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పాలని నిర్ణయించారు. బ్లడ్ బ్యాంక్ త‌ర‌హాలోనే ఆక్సీజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, క‌రోనా రోగుల‌కు త‌న వంతు సాయం చేసేందుకు సంక‌ల్పించారు. ఇందుకోసం ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. వారం రోజుల్లో ఈ కార్య‌క‌లాపాలు ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. ప్రతీ జిల్లాలోనూ ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌’లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ట్విటర్ వేదికగా అఫీషియల్ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది. వచ్చే వారం రోజుల్లో ప్రజలకు ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆక్సిజన్ బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలు, నిర్వహణను హీరో రామ్ చరణ్ చూసుకోనున్నట్లు తెలుస్తోంది.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు