చైనా వ‌దిలిన జీవాయుధమే క‌రోనా వైర‌స్.

  0
  1571

  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైర‌స్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. యావ‌త్ ప్ర‌పంచాన్ని, మాన‌వాళిని ప్రమాదంలోని నెట్టేసిన ఈ మహమ్మారి చైనాలోని ఊహాన్ లో పుట్టింద‌న్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డి నుంచే ఖండాంత‌రాల‌కు ఈ వైర‌స్ అంటువ్యాధిలా వ్యాపించింది. కోట్ల మందికి ఈ వైర‌స్ సోకింది. ల‌క్ష‌ల మందిని పొట్ట‌న బెట్టుకుంది. ఒక‌టిన్న‌ర ఏడాదిగా ప్ర‌పంచంపై మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తూనే ఉంది. అయితే క‌రోనా మహమ్మారిపై వీకెండ్ ఆస్ట్రేలియన్ పత్రికలో ప్రచురితమైన ఓ కథనం సంచ‌ల‌నం రేపుతోంది. చైనా దేశం కృత్రిమంగా తయారుచేసిన జీవాయుధమే కరోనా వైరస్ అని ఆ పత్రిక పేర్కొంది. ఈ వైర‌స్ విషయంలో ఎన్నో దేశాల‌కి చైనాపై ఇప్పటి వరకు ఉన్న అనుమానాలు నిజమేనని ఈ కథనం చెబుతోంది.

  కరోనా వైరస్ వెలుగులోకి రావడానికి సరిగ్గా నాలుగేళ్ల ముందు.. అంటే 2015లో చైనా శాస్త్రవేత్తలు, వైద్య‌ఆరోగ్య నిపుణులు రూపొందించిన ఓ డాక్యుమెంట్‌ని ఆ ప‌త్రిక వెలుగులోకి తెచ్చింది. అందులో వారు కరోనా వైరస్‌ను జీవాయుధంగా అభివర్ణించిన‌ట్లు పేర్కొంది. మనుషుల్లో భయంకరమైన వ్యాధిని కలిగించే ఈ వైరస్‌ను ఓ ఆయుధంగా వాడుకోవాలన్న కుట్ర ఆ డాక్యుమెంట్‌లో స్పష్టంగా కనిపిస్తోందని పత్రిక పేర్కొంది. ఒక‌వేళ మూడో ప్రపంచ యుద్ధం సంభ‌విస్తే జీవాయుధంగా ఈ వైరస్‌ను ఉపయోగించేందుకు చైనా దీనిని అభివృద్ధి చేసిందని, ఇందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని రాసుకొచ్చింది. చైనా మిలటరీ సైంటిస్టులు కూడా దీని గురించి చర్చించారని కూడా వివరించింది. కరోనాలోని కొత్త స్ట్రెయిన్లను అస్త్రంలా ఎలా ప్రయోగించాలన్న విష‌యాన్ని పూస‌గుచ్చింది. ప్ర‌పంచ యుద్దం కంటే భ‌యంక‌ర‌మైన జీవాయుధాన్ని మ‌నం సృష్టించ‌బోతున్నాం అంటూ వారి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌ని ఈ ప‌త్రిక పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ క‌ధ‌నంపై అంత‌ర్జాతీయంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

  క‌రోనా వైర‌స్ చైనా నుంచి వ్యాప్తి చెందిన‌ప్పుడు ఎన్నో దేశాలు చైనాపై అనుమానాలు వ్య‌క్తం చేశాయి. ఆ అనుమానాల‌న్నీ నిజ‌మ‌య్యేలా వీకెంట్ ఆస్ట్రేలియ‌న్ ప‌త్రిక చైనా కుట్ర‌ల‌న్నింటినీ బ‌య‌ట పెట్టింది. అప్ప‌టి అమెరికా అద్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మాన‌వాళి వినాశ‌కారి వైర‌స్ ను చైనా ప్ర‌పంచం మీద‌కి వ‌దిలిందంటూ ఆయ‌న అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేసినా, ఇప్పుడు నిజ‌మ‌ని న‌మ్మ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇప్ప‌టికే ఈ వైర‌స్ 157 కోట్ల మందికి సోకింది. 33 ల‌క్ష‌ల మంది చ‌నిపోయారు. ల‌క్ష‌ల మంది మృత్యువుతో పారాడుతున్నారు. ఇలాంటి విప‌త్కర ప‌రిస్థితుల్లో వైర‌స్ ను అంతం చేసేందుకు చైనా స‌హ‌క‌రించాల్సిన అవ‌స‌ర‌ముంది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.