మహిళా ఐపీఎస్ పై ఉన్నతాధికారి లైంగిక వేధింపులు…

    0
    648

    ఎస్పీ స్థాయిలో ఉన్న మహిళా ఐపీఎస్ ఆఫీసర్ తనను పై అధికారి లైంగికంగా వేధిస్తున్నాడంటూ మొరపెట్టుకుంటే ,ఇక సామాన్యుల ఘోష ఎవరికి చెప్పుకోవాలి. చెన్నైలో మహిళా ఐపీఎస్ లపై మూడో దఫా ఉన్నతాధికారుల వేధింపుల పర్వం బయటపడింది. తాజాగా స్పెషల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ లా అండ్‌ ఆర్డర్‌ రాజేష్‌ దాస్ తనను లైంగికంగా వేధించాడంటూ తమిళనాడుకు చెందిన మహిళా ఐపీఎస్‌ అధికారి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. విధుల్లో భాగంగా కారులో పోతున్నప్పుడు తనపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళా అధికారి ఆరోపించారు. ఇటీవల పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పీఎం మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి చేపట్టిన భద్రతా సమావేశాల్లో సదరు డీజీపీని పాల్గొనకుండా సస్పెండ్‌ చేసినట్లు రాష్ట్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ పుదుచ్చేరి, తమిళనాడులో పర్యటించనున్నారు. మహిళా ఐపీఎస్ ఫిర్యాదుపై విచారణకు ప్రణాళిక, అభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి జయశ్రీ రఘునందన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

    ఇవీ చదవండి:

    అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

    ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

    ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?