దేవుడితో ఫోన్లో కన్సల్టేషన్ లక్షలు గుంజింది.

  0
  655

  తాను దైవ‌దూత‌న‌ని, మ‌హిళ‌ల క‌ష్ట‌న‌ష్టాలు తీర్చ‌మ‌ని, దేవుడే త‌న‌ను పంపించాడ‌ని చెబుతూ సంజ‌న ఓ మ‌హిళ… అమాయ‌క మ‌హిళ‌ల నుంచి ల‌క్ష‌లు గుంజేసింది. తాను రోజు రాత్రి దేవుడితో ఫోన్‌లో మాట్లాడ‌తాన‌ని కూడా చెప్పి మోసం చేసిందంటే, ఆమె ఎంత క్రిమిన‌ల్ బ్రెయినో అర్ధ‌మ‌వుతుంది. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు, కూక‌ట్ ప‌ల్లి వెంక‌ట‌ర‌మ‌ణ కాల‌నీలో ఉండే సంజ‌న‌ను అరెస్టు చేశారు. కొంత‌కాలంగా ఆమెపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

  మ‌హిళ‌ల‌కు ఏవైనా క‌ష్టాలు ఉంటే, వారి స‌మ‌స్య‌లు తీర్చ‌మ‌ని దేవుడితో మాట్లాడి, ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పేది. ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చ‌మ‌నే దేవుడు త‌న‌కు చెప్పాడ‌ని అంద‌రితోనూ చెప్పుకునేది. ఒక్క ప్రార్ధ‌న చేస్తే వారి క‌ష్టాల‌న్నీ తొల‌గిపోతాయ‌ని న‌మ్మ‌బ‌లికేది.

  ఇటీవ‌ల కుదిరిన పెళ్ళి త‌ప్పిపోయిన ఓ యువ‌తి, సంజ‌న ట్రాప్ లో ప‌డింది. ఆమెను సంజ‌న వివిధ ర‌కాలుగా న‌మ్మించి దాదాపు 70 ల‌క్ష‌ల రూపాయ‌లు గుంజింది. ఆల‌స్యంగా ఈ విష‌యం తెలుసుకున్న ఆమె తండ్రి ఫిర్యాదు మేర‌కు పోలీసులు.. సంజ‌న గురించి ఆరా తీయ‌డంతో, చేసిన‌ మోసాల‌న్నీ తెరపైకి వ‌చ్చాయి. దీంతో సంజ‌న‌ను అరెస్టు చేసి జైలుకి త‌ర‌లించారు పోలీసులు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.