అందాన్ని ఎరవేస్తుంది.తరువాత చేతికి చిప్పే.

  0
  917

  వామ్మో ..ఇది మహా మాయలాడి ..జగత్ కిలాడి. అందాన్ని ఎరవేస్తుంది. ఐపీఎస్ నంటుంది .. మానవహక్కుల కమీషన్ సౌత్ ఇండియా చైర్ పర్సన్ అంటుంది. మగాళ్లను ఏదో ఒక ఎరవేసి పట్టేస్తుంది.. మాటల్లో పెట్టి , మభ్యపెట్టి , మురిపించి , మరిపించి మట్టికరిపిస్తుంది.. ఏమి జరిగిందో తెలుసుకునేలోపే లక్షలు , వీలయితే కోట్లు కొల్లగొట్టేస్తుంది.. అదీ దాని టాలెంట్. పెళ్లి పేరుతో ఈ వగలాడి 11 కోట్ల రూపాయలు దోచేసింది. హైదరాబాద్‌ లోని బాచుపల్లి పోలీసుల విచారణలో దీని బాగోతం మొత్తం బట్టబయలు అయింది.

  శ్రుతి సిన్హా అనే యువతి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. వీరారెడ్డి అనే వ్యాపారికి వల విసిరింది. అందాన్ని ఎరగా వేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. అతని నుంచి అప్పుడప్పుడు అవసరాలంటూ , వ్యాపారాలంటూ డబ్బులు తీసుకుంది. ఇలాగే మొత్తం 11 కోట్లు చల్లగా లాగేసింది. విలువైన కార్లు కొనుక్కుంది. మోసం ఎల్లకాలం దాగదు కదా ..వగలాడి రంకు , బొంకు పాపం వీరారెడ్డికి ఆలస్యంగా తెలిసింది. లబోదిబో మంటూ పోలీసులవద్దకు పరుగులు తీశాడు. ఈ వగలాడి ముఠాలో మరో ముగ్గురున్నారు. పోలీసులు ఆమెనుంచి 6 కోట్లరూపాయల ఆస్తులు , కార్లు, విల్లా , డెబిట్ , క్రెడిట్ కార్డులు స్వాధీనంచేసుకున్నారు.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?