వీడు మామూలోడు కాదు, మాయలోడు.

  0
  8123

  వీడు మామూలోడు కాదు… సోష‌ల్ మీడియాను అడ్డం పెట్టుకుని అమ్మాయిలు ఆంటీల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుని, వారి మానాన్నే కాదు.. డ‌బ్బుల‌ను దోచేశాడు. బ్లాక్ మెయిల్ చేసి వారిని చిత్ర‌హింస‌ల‌కు గురి చేశాడు. క‌డ‌ప‌కు చెందిన వీడి పేరు ప్ర‌స‌న్న‌కుమార్. రాజారెడ్డి, ప్ర‌శాంత్ రెడ్డి, టోనీ అనే పేర్లు కూడా ఉన్నాయి. 23 ఏళ్ళ ఈ చీటింగ్ యువ‌కుడిని క‌డ‌ప పోలీసులు అరెస్టు చేశారు. బీటెక్ మొద‌టి ఏడాదిలోనే చ‌దువు మానేసిన ఇత‌ను, 2017 నుంచి చైన్ స్నాచింగులు చేసేవాడు. జైలుకి కూడా వెళ్ళివ‌చ్చాడు. ఆ త‌ర్వాత దొంగ‌త‌నాలు చేస్తే జైలుకి వెళ్ళాల్సి వ‌స్తుంద‌ని భావించి, అమ్మాయిల‌కు, ఆంటీల‌కు వ‌ల వేసే ప‌ని పెట్టుకున్నాడు.

  ఫేస్ బుక్, ఇన్‌స్టా గ్రాం, షేర్ చాట్ వంటి సోష‌ల్ మీడియాల్లో అకౌంట్లు ఓపెన్ చేశాడు. మ‌హిళ‌ల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుని చిన్న‌గా ముగ్గులోకి దించేవాడు. ప్రేమ పేరుతో లోబ‌రుచుకునేవాడు. ఆ త‌ర్వాత అత‌ను అర్ధ‌న‌గ్నంగా ఉంటూ, వారిని అర్ధ‌న‌గ్నంగా ఉండ‌మ‌ని చెప్పి రికార్డు చేసేవాడు. అవ‌కాశం క‌లిగితే వారిని క‌లిసి శృంగారంలోకి దించేవాడు. దాన్ని మొబైల్ లో రికార్డు చేసి ఆ త‌ర్వాత బ్లాక్ మెయిల్ చేసేవాడు. సుమారు 200 మంది అమ్మాయిలు, 100 మంది ఆంటీల‌ను లైన్ లోకి దించి, బ్లాక్ మెయిల్ చేస్తూ దోచుకునేవాడ‌ని తెలిసింది. అయితే చాలామంది మ‌హిళ‌లు ప‌రువు పోతుంద‌ని కేసులు పెట్ట‌కుండా ఉండిపోయారు. వాడు పెట్టే భ‌యాల‌కు లొంగి డ‌బ్బులు, న‌గ‌లు ఇచ్చేవారు. ఒక దొంగ‌త‌నం కేసు, చీటింగ్ కేసులో వీడిని అరెస్టు చేసిన పోలీసుల‌కు వీడి అరాచ‌కాల‌న్నీ బ‌య‌ట‌ప‌డ్డాయి.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?