చిరంజీవి సినిమాపై చత్తీస్ ఘడ్ ఎఫెక్ట్..

  0
  134

  చత్తీస్ ఘడ్ మారణకాండకు, చిరంజీవి కొత్త సినిమా ఆచార్యకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. అయినా కూడా ఆ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది. చిరంజీవి ఆచార్యతోపాటు, రానా హీరోగా నటిస్తున్న విరాపటపర్వం కూడా ఇలాగే చిక్కుల్లో పడింది. ఈ రెండు సినిమాల విడుదల ఆపేయాలంటూ.. సెన్సార్ కు ఫిర్యాదులందాయి. వాటికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వవద్దని “యాంటీ టెర్రరిజం ఫోరమ్” సెన్సార్ బోర్డుకు విన్నవించింది. అలాగే, భవిష్యత్‌లోనూ అలాంటి సినిమాలను ప్రోత్సహించొద్దని సెన్సార్ బోర్డును కోరింది.

  అయితే సెన్సార్ బోర్డు అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో కూడా గమ్యం, దళం వంటి సినిమాలు నక్సల్స్ నేపథ్యంలో వచ్చినవే వాటికి ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. విరాటపర్వం సినిమాలో హీరో రానా కామ్రేడ్ రవన్నగా కనిపిస్తాహరు. ఇక ఆచార్యలో చిరంజీవి మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. రామ్ చరణ్ తో కలసి చిరంజీవి నక్సలైట్ గెటప్ లో ఉన్న స్టిల్ ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలపై సెన్సార్ బోర్డ్ కి లేఖలందాయి.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ