ఎన్నికలు బహిష్కరిస్తున్నాం..

  0
  184

  ఈనెల 8వ తేదీ జరగబోతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలకు పాత నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రతిపక్షాలు అడుగుతున్నా పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎలక్షన్ కమిషన్ పాత నోటిఫికేష్ ప్రకారమే ఎన్నికలు జరపాలనుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  గత ఎన్నికల కమిషనర్ కూడా వీటిని రద్దు చేసి, కొత్తగా ఎన్నికలు జరపాలని ఆలోచించారని, గత ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జరిగిన ఏకగ్రీవాలన్నీ బలవంతపు ఏకగ్రీవాలని అందువల్ల వాటిని రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని అన్నారు. ఎన్నికల కమిషనర్ వైసీపీ చేతిలో కీలుబొమ్మ అని విమర్శించారు.

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే.